కోలీవుడ్‌లో ఈ జంట ఏమీ చేసినా చర్చనీయాంశమైంది. పెళ్లితోనే పెను దుమారాన్ని రేపిన ఈ జంట మరెవ్వరో కాదూ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ , నటి మహాలక్ష్మి. వీరిద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్న సంగతి విదితమే.
కోలీవుడ్‌లో ఈ జంట ఏమీ చేసినా చర్చే. పెళ్లితోనే పెను దుమారాన్ని రేపిన ఈ జంట మరెవ్వరో కాదూ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ , నటి మహాలక్ష్మి. వీరిద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్న సంగతి విదితమే. అయితే అప్పట్లో మహాలక్ష్మి అతడిని డబ్బు కోసమే చేసుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే రవీంద్రకు ఇది రెండవ వివాహం. ఆ విషయం సద్దుమణిగింది అనుకునే లోపు మరో రచ్చ మొదలైంది. వీరిద్దరూ విడిపోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. దీంతో దీనిపై స్పందించిన మహాలక్ష్మి ఓ పోస్టుతో ఆమె రూమర్లకు చెక్ పెట్టేసింది. ఇప్పుడు ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకు ఏమైందంటే..?
రవీంద్ర నిర్మాత అన్న సంగతి విదితమే. లిబ్రా ప్రొడక్షన్ పేరుతో ఆయన పలు సినిమాలను నిర్మించారు. అయితే అతడు తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ప్రవాస భారతీయుడు విజయ్ అనే వ్యక్తి.. రవీందర్‌కు క్లబ్ యాప్ ద్వారా పరిచయమయ్యాడు. అనంతరం అతడి సినిమా నిర్మాణంలో భాగమయ్యాడు. గత ఏడాది ఓ సినిమాకు పెట్టుబడి పెట్టాలని, హీరోకు అడ్వాన్స్ ఇవ్వాలని తనను రూ. 20 లక్షలు అడగ్గా.. రూ. 15 లక్షలు రెండు విడతలుగా ఇచ్చానని విజయ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా రవీందర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరిగి తన డబ్బులు అడిగినప్పుడు రవీందర్ దూషించేవాడని, ఇప్పుడు తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడని విజయ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ కేసు వాపసు తీసుకోవాలని, తిరిగి డబ్బులు చెల్లిస్తానని విజయ్ తో రవీందర్ చర్చలు జరిపినట్లు సమాచారం. అయినప్పటికీ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో మరోసారి ఫిర్యాదు చేశారు. రవీందర్‌పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. దీంతో రవీందర్ స్వయంగా హాజరై వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, డబ్బులు తిరిగి ఇవ్వకుంటే రవీందర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.