పెళ్లి బంధం అనేది ఇద్దరు వ్యక్తుల్ని ఒక్కటి చేస్తుంది. ఒకరి మీద ఒకరు ప్రేమను చూపటానికి ఇదొ మంచి అవకాశం. అంతేకాదు! ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి తప్పని సరి..
సాధారణంగా పెళ్లి కుదిరిన తర్వాత వధువు తరపు బంధువులు వరుడి కోసం కానుకలు ఇవ్వటం పరిపాటి. వాటిలో బంగారం, మంచాలు, వంటసామాన్లు, వెండి వస్తువులు మొదలైనవి కానుకల రూపంలో ఇస్తూ ఉంటారు. ఇంకా కొందరు తమ కూతురు సుఖంగా ఉండాలని పొలం, ఇల్లు, ప్లాట్ అమ్మాయి పేరు మీద రిజిస్ట్రర్ చేసి అప్పగిస్తారు. గ్రామాల్లో అయితే కొందరు పాలిచ్చే ఆవును, గేదెను భరణం కింద ఆడపిల్లకు ఇస్తూ ఉంటారు. ఇదంతా ఒకెత్తయితే.. వధువు లేదా వరుడు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో కూడా ఓ వధువు.. వరుడికి మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ చూసి వరుడు ఎంతో సంతోషించాడు. అంతలా అతడ్ని సంతోష పెట్టిన గిఫ్ట్ ఏంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.. వధువు సుఖప్రియ స్వస్థలం మధురై జిల్లా అయ్యన్ కట్టై అనే గ్రామం. సుఖప్రియను తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుకున్నారు. ఇక, సుఖప్రియ ఇంట్లో ఓ జల్లికట్టు ఎద్దు ఉంది. దాన్ని ఆ అమ్మాయి తన ప్రాణంగా చూసుకుంటూ ఉంది. అదే విధంగా ఇంట్లో వారు కూడా ఆ జల్లికట్టు ఎద్దును అపురూపంగా చూసుకుంటూ ఉన్నారు.
ఈ సమయంలోనే సుఖప్రియకు పెళ్లి కుదిరింది. పెళ్లి తర్వాత ఆ ఎద్దును విడిచి ఉండలేనని ఆమె భావించింది. తనతో పాటు అత్తింటికి తీసుకెళ్లటానికి నిశ్చయించుకుంది. పెళ్లి రోజు నాడు ఎద్దుకు పూలు కండువాతో అలంకరించి పెళ్లిలో అందరి ముందు స్టేజిపైకి తీసుకువచ్చింది. తర్వాత దాన్ని భర్తకు కానుకగా ఇచ్చింది. వధూవరులు జల్లికట్టు ఎద్దుతో ఫొటోలు దిగి అందరిని అబ్బురపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.