ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ నటి, యూట్యూబర్ గాయత్రి కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోకముందే.. మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడి కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు.. బాలీవుడ్ దర్శకుడు గిరీష్ మాలిక్ కుమారుడు మన్నన్.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మార్చి 18న ఈ విషాదం చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: గాయత్రి చనిపోవడానికి ముందు ఏం జరిగింది..?
గిరిష్ మాలిక్ కుమారుడు మన్నన్ మద్యానికి బానిసయ్యాడు. పైగా ఒబెసిటీతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇకపై మద్యం తాగితే.. బాగుండదని గిరిష్.. మన్నన్‌ని హెచ్చరించాడు. ఈ క్రమంలో హోలీ పండుగ నాడు మన్నన్ ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్లుగా తాగాడు. తూలుతూ ఇంటికి వచ్చిన మన్నన్‌ని చూసి.. అతడి తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఆమెపై చిరాకుపడ్డాడు మన్నన్. ఇది గమనించిన గిరిష్ కుమారుడిని మందిలించాడు. తల్లితో మాట్లాడే పద్దతి ఇదేనా అంటూ ప్రశ్నించాడు. తండ్రి మాటలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను మన్నన్ ముంబైలోని అంధేరిలో ఉన్న అపార్టమెంట్ లోని ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి: Jr.ఎన్టీఆర్ కారుని ఆపిన పోలీసులు! కారణం?ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మన్నన్‌ని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందనుకున్న తన కన్న కొడుకు ఇలా ఆత్మహత్యకు పాల్పడంతో డైరెక్టర్ గిరీష్ మాలిక్ కుటుంబం షాక్‌లో ఉంది. పోలీసులు పోస్ట్ మార్టమ్ అనంతరం అతని పార్ధివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే సదరు దర్శకుడి స్వస్థలం ఢిల్లీ కావడంతో కుమారుడి అంతిమ సంస్కారాలు ఢిల్లీలో నిర్వహించారు. పోలీసులు యాక్సిడెంటల్ కేసుగా ఈ ఆత్మహత్యను నమోదు చేసారు. గిరిష్ కుమారుడి మృతి వార్త తెలిసి.. సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. క్షణికావేశంలో ప్రాణం తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రముఖ నటుడి సోదరుడు అరెస్ట్..!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.