’పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహమునాడు పొందుర సుమతీ !‘.. పుత్రుడు పుట్టినప్పుడు కాదూ.. పుత్రుడు గొప్పవాడే నలుగురు పొగుతుండే అప్పుడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం. నిజంగా ఇప్పుడు అదే పుత్రోత్సాహంతో మునిగి తేలుతున్నారు ఆర్ఆర్ఆర్ హీరోల తండ్రులు చిరంజీవి, బాలకృష్ణలు.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ ఫాంటసీ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం గురించే ఇప్పుడు చర్చంతా. ప్రపంచం మొత్తం భారత్ వైపు తిరిగి చూసేలా చేసింది ఈ మూవీ. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లో ఆస్కార్ దక్కడంపై చిత్ర బృందంతో పాటు భారత్‌లోని సగటు సినిమా అభిమాని గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ సినిమా ఆస్కార్ రావడంపై ప్రధాని మోడీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినిమా నటీనటులు చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ తండ్రి చిరంజీవి.. పుత్రోత్సాహంతో మునిగి తేలిపోతున్నారు. దీనిపై మరో హీరో జూ. ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణ కూడా స్పందించారు.
ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావడంపై చిత్ర బృందానికి నందమూరి బాలకృష్ణ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని గెలుపొందిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి నా హృదయ అభినందనలు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిది. స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అలాగే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నభారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్ర బృందానికి అభినందనలు’అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
నటుడు రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి సైతం కుమారుడు నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ఉబ్బితబ్బిబయ్యారు. ‘ఇది ప్రతి భారతీయుడికి గర్వించదగ్గ విషయం. ఈ చిత్ర బృందానికి నా హృదయ పూర్వక అభినందనలు. గొప్ప చరిత్రాత్మక కీర్తిని మన సినిమా ఇండస్ట్రీకి తెచ్చినందుకు ముఖ్యంగా రాజమౌళికి అభినందనలు. ఇందులో నా కుమారుడు ఓ భాగమైనందుకు గర్వంగా ఉంది. భారతీయులు గర్వించదగిన సినిమాగా మారింది. ఆస్కార్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అనిపించినప్పటికీ.. కొంచెం టెన్షన్ పడ్డాను’అని వ్యాఖ్యానించారు. అంతక ముందు సినిమాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరు ట్వీట్ చేశారు.
Actor, Leader #NandamuriBalakrishna congratulated the team’s of #RRRMovie & #TheElephantWhisperers on winning #Oscars2023 awards! @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani @boselyricist @Rahulsipligunj @kaalabhairava7 #PremRakshith @DVVMovies #NaatuNaatu pic.twitter.com/1phJzw8htd
— Vamsi Kaka (@vamsikaka) March 13, 2023