ఫిల్మ్ డెస్క్- నందమూరి నట సింహం బాలకృష్ణ తాజా సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇది బాలయ్యకు 107వ సినిమా. ఈ మూవీని ప్రముఖ డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు. తెలంగాణలోని సిరిసిల్ల పరిసర ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ప్రముఖ స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
బాలకృష్ణ అఖండ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో NBK 107 లొకేషన్ నుంచి ఓ ఫొటో లీక్ అయ్యింది. బాలయ్య బాబు లుక్ అదిరిపోయింది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలకృష్ణ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. బాలకృష్ణ తనదైన స్టైల్లో మెలితిప్పిన మీసాల లుక్ లో అలరిస్తున్నారు.
ఇక బాలకృష్ణ తాజా సినిమాను నిజ ఘటలను ఆధారంగా చేసుకుని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. అంతే కాదు బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ తొలి రోజునే బాలకృష్ణ లుక్ లీక్ కావడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. అన్నట్లు బాలయ్య సరసన శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ సైతం కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ మూవీలో విలన్గా నటిస్తున్నారు. అఖండ సినిమాతో ఏడాది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలకృష్ణ, క్రాక్ వంటి సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచానుల నెలకొన్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.