రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1 నుంచి చేపట్టే మహా పాదయాత్రకు మద్దతు తెలపాలని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కోరినట్లు జనసేన పార్టీ తెలిపింది. శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని జేఏసీ నేతలు కలిశారు. తుళ్లూరు నుంచి తిరుమల వరకు దాదాపు 45 రోజుల పాటు మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ పాదయాత్రకు పవన్‌కళ్యాణ్ మద్దతు ప్రకటించాలని కోరారు. మరి పవన్ ఈ పాదయాత్రకు మద్దతు ఇస్తారో లేదో చూడాలి.
మహా పాదయాత్రకు శ్రీ @PawanKalyan గారి మద్దతు కోరిన రాజధాని రైతుల ప్రతినిధులు pic.twitter.com/vJwDKtvYUO
— JanaSena Party (@JanaSenaParty) October 22, 2021