సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ వెలిగిపోవాలనే కోరికతో.. ఎంతో మంది.. ఎన్నో ఆశలతో వస్తారు. వచ్చాక కానీ అసలు వాస్తవం బోధపడదు. తాము చూసేదంతా పైపై మెరుగులే అని.. ఆ నవ్వుల వెనక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాగున్నాయని అర్థం అవుతుంది. ఈ కష్టాలకు తట్టుకోలేక చాలా మంది ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోతారు. మరికొందరు మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నించి సక్సెస్ అవుతారు. మరి వారి సక్సెస్ అలానే కొనసాగుతుందా అంటే చేప్పలేము. వరుసగా కొన్ని చిత్రాలు చేసిన తర్వాత సడెన్‌గా ఫేడ్ అవుట్ అవుతారు. పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే.. ఇండస్ట్రీ.. వారిని వెలివేసిందా?అనే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాను అంటుంది హీరోయిన్ నీతూ చంద్ర. తాను పడిన కష్టాల గురించి, ఇతర విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.
‘గోదావరి’ సినిమాలో హీరో సుమంత్ పక్కన అతడి మరదలి నీతూ చంద్ర నటించింది. జాంగ్రీ తినాలో, లడ్డు తినాలో అర్థం కానంత అయోమయానికి గురయ్యే అమాయక అమ్మాయి పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ ‘గరం మసాలా’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నీతూ చంద్ర.. ఆ తర్వాత ఓ హాలీవుడ్ మూవీలో కూడా నటించింది. గత కొన్నేళ్లుగా నీతూ చంద్ర ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, ఇండస్ట్రీ గురించి వివరించింది.
నీతూ చంద్ర మాట్లాడుతూ.. తాను 13 మంది జాతీయ అవార్డు విన్నర్స్ తో ఎన్నో అద్భుతమైన సినిమాలో నటించానని, కానీ ప్రస్తుతం తాను చేయడానికి సినిమాలు గానీ, చేతిలో డబ్బులు గాని లేవంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. తాను దారుణమైన పరిస్థితిలో ఉన్నాని, తనలాంటి పరిస్థితి పగవారికి కూడా రాకుడదని ఆమె తెలిపారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహార గురించి మాట్లాడిన నీతూ.. “నేను కూడా చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. వ్యక్తులు మరణించిచాకే .. వారు చేసిన పనులను గౌరవిస్తారని ఆ సమయంలో నాకు అనిపించింది. దీంతో కొన్ని ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మరి..నీతూ చంద్ర లైఫ్ స్టోరీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.