లయ.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలిగింది. కానీ, పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా గడుపుతోంది. అమెరికాలో సెటిల్ అయిన లయ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో మాత్రం అప్ డేట్స్ పెడుతూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటూ ఉంటుంది. డాన్స్ వీడియో, ఫన్నీ వీడియోలు, ఫ్యామిలీ ఫొటోస్ ను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా లయ వారి ఇంట జరిగిన రాఖీ వేడుకకు సంబంధించిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోలో లయ కాకుండా ఇంకొకరు అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆమె ఎవరో కాదు లయ కుమార్తె. లయకు కుమార్తె, కుమారుడు అని అందరికీ తెలుసు. అక్కా తమ్ముళ్ల రాఖీ సంబరాన్ని వీడియోగా పోస్ట్ చేశారు.
కానీ, ఆ వీడియోలో లయ కుమార్తె శ్లోక మాత్రం ఎల్లో డ్రెస్ లో అచ్చూ లయలాగానే ఉంది. వాళ్లిద్దరూ కవలలు అని చెప్పినా కూడా నమ్మేలా ఉన్నారు. ఇప్పుడు అభిమానులు సైతం అక్కాచెల్లెళ్లు అంటే నమ్మేస్తారంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం లయ ఇంట రాఖీ సెలబ్రేషన్స్ వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.