విశాల ఆకాశంలో మేఘాలు రకరకాల ఆకారాల్లో కనిపిస్తుంటాయి. సరిగ్గా గమనిస్తే మనకు తోచిన విధంగా ఆకారాలకు పేర్లు పెట్టేసుకుంటాం. అయితే కొన్ని సార్లు వింత ఆకారాలు మనల్ని ఆకర్షిస్తుంటాయి. ఆకాశానికి చీరకట్టినట్లు కనిపించే ఇంధ్రధనస్సు
విశాల ఆకాశంలో మేఘాలు రకరకాల ఆకారాల్లో కనిపిస్తుంటాయి. నింగి వైపు చూస్తూ మనకు తోచిన విధంగా ఆకారాలకు పేర్లు పెట్టేసుకుంటాం. అయితే కొన్ని సార్లు వింత ఆకారాలు, దృశ్యాలు మనల్ని ఆకర్షిస్తుంటాయి. ఆకాశానికి చీరకట్టినట్లు కనిపించే ఇంధ్రధనస్సు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ, చిన్నా, పెద్దలను కనువిందు చేస్తూ ఉంటుంది. ఇక వానల సమయంలో ఉరుములు, మెరుపులు ఏర్పడ్డప్పుడు, మేఘాలు నల్లగా మబ్బుల్లాగా మారినప్పుడు కొన్ని వింత ఆకారాలు కనిపించడం సర్వసాధారణం. అలాగే కొన్ని సార్లు సాసర్లు కనిపించడం, ఆకాశం రంగులు మారడం చూసి ఇదేదో ఏలియన్స్ పని అనుకున్న సందర్భాలున్నాయి. తాజాగా అటువంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది.
కర్ణాటకలోని బెంగళూరులో ఓ వింత దృశ్యం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. భారీ వర్షాలు పడుతున్న ఈ సమయంలో ఆకారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ నెటిజన్ దాన్ని వీడియో తీసి పోస్టు చేయడంతో వైరల్ అవుతుంది. ఓ మిస్టీరియస్ నీడ ఒకటి కనిపించింది. హెబ్బాల్ ఫ్లై ఓవర్ సమీపంలో ఆకాశంలో వింత ఆకారం కనిపించింది. కాస్తంత మిరుమిట్లు గొలిపేలా, తలుపుల ఆకారంలో ఉన్న ఓ ఇమేజ్ కనిపించింది. ‘హెబ్బాల్ ఫ్లైఓవర్ సమీపంలో ఆకాశంలో ఒక మిస్టీరియస్ నీడ కనిపించింది ఇంకెవరైనా చూశారా? ఇది బహుశా ఏమై ఉండొచ్చు? భవనం నీడనా..? అలా అయితే, దాని వెనుక ఉన్న సైన్స్ ఏమై ఉండవచ్చు?’ అని ఓ ట్విట్టర్ యూజర్ 15 సెకన్ల పాటు ఉన్న వీడియోను పోస్టు చేశారు. కాగా, దీనిపై కామెంట్లు వస్తున్నాయి. ఇది స్వర్గానికి తలుపులని, అది స్వర్గానికి మార్గం అని రాసుకొచ్చారు. కొంత మంది ఏలియన్స్ పని అని, బట్టలు ఆరబెట్టుకోవడానికి వచ్చాయంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు. అయితే అది నిజమైన వీడియోనే కాదో తెలియాల్సి ఉంది.
A mysterious shadow (object?) was seen in Bengaluru skies last night near Hebbal flyover. Did anyone else see? What could this possibly be? A shadow of a building? If it is, then what could possibly be the science behind it?
Credits: @SengarAditi pic.twitter.com/8YOIzvIsPv
— Waseem ವಸೀಮ್ وسیم (@WazBLR) July 23, 2023