చిన్న వయస్సులోనే అద్భుతాలు చేస్తున్నారు కొంత మంది పిల్లలు. అం, అ: తెలియని సమయంలోనే.. అలవోకగా పద్యాలు పాడేయటం, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తూ ఔరా అనిపిస్తారు. చదువులో కూడా మేటీగా రాణిస్తూ మెప్పు పొందుతారు.
పిట్ట కొంచెం కూత ఘనం అనే మాటలను రుజువు చేస్తుంటారు కొంత మంది పిల్లలు. చిన్న వయస్సులోనే అద్భుతాలు చేస్తుంటారు. అం, అ: తెలియని సమయంలోనే.. అలవోకగా పద్యాలు పాడేయటం, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తూ ఔరా అనిపిస్తారు. అంతేకాదూ తెలివితేటల్లో మెండుగా ఉంటారు. ఏదీ చెప్పినా ఇట్టే పట్టేస్తూ తల్లిదండ్రులకు, బంధువులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు. మొన్న ఈ మధ్య సరిగ్గా మాటలు కూడా రాని రెండేళ్ల పసివాడు.. ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించిన సంగతి విదితమే. కొంత మంది చిన్నారులు వయస్సుకు మించి పనులు చేస్తూ అబ్బుర పరుస్తుంటారు. చదువులో కూడా మేటీగా రాణిస్తూ మెప్పు పొందుతారు. అటువంటి వారిలో ఈ చిన్నారి ఒకరు.
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బాలికలు పై చేయి సాధించారు. అయితే ఇందులో నిరుపేద కుటుంబంలో పుట్టిన బాలిక.. ఫలితాల్లో సత్తా చాటింది. కాకినాడ జిల్లాలో ఆరో తరగతి చదువుతున్న హేమశ్రీ.. పదో తరగతి ఫలితాల్లో 488 మార్కులు తెచ్చుకున్న సంగతి విదితమే. ఇప్పడు మరో ఆరో తరగతి విద్యార్థిని కూడా ఈ ఫలితాల్లో సత్తా చాటింది. ఈ చిన్నారి పేరు చిర్రా అనఘాలక్ష్మి. వయస్సు 11 ఏళ్లు. ఆరో తరగతి చదువుతున్న ఈ చిన్నారి.. పుట్టుకతోనే సర్వస్వతి క్షటాక్షంతో పుట్టినట్లుంది. అబాకస్‌తో పాటూ వేద గణితంలో ప్రతిభ కనబరించింది. గణిత అవధానాల్లో శతావధాన స్థాయికి చేరుకుంది.
గుంటూరుకు బ్రాడీపేటకు చెందిన సత్యదేవీ, విష్ణువర్థన్ రెడ్డిల కుమార్తె అనఘా లక్ష్మి. ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. తండ్రి మంగళగిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తుండగా.. తల్లి మ్యాథ్స్ ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి తల్లి చెప్పే పాఠాలను వింటూ వస్తున్న అనఘా.. అబాకస్, వేదగణితంలో ప్రావీణ్యం సంపాదించింది. గణితంలో శతావధాన స్థాయికి చేరుకుంది. చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బాలిక ప్రతిభను చూసిన మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశంసించడంతో పాటు పదో తరగతి రాయించమని సూచించారు. పాఠశాల డైరెక్టర్ ఆర్.రాము, తల్లిదండ్రులు విద్యా శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుని పదో తరగతి పరీక్షలకు పంపారు. పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 566 మార్కలు సాధించి సత్తాను చాటింది.