పార్వతి తిరువొత్తు.. మలయాళం, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపును మూటగట్టుకుంది. కేరళలోని కోళిక్కోడ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ 2006లో మళయాళ చిత్రం ఔట్ ఆఫ్ సిలబస్ అనే మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆకట్టుకునే అందం, అభినయంతో తోడవ్వడంతో అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే..? ఈ బామకు గత రెండేళ్ల నుంచి హర్ష అనే వ్యక్తి నుంచి వేదింపులు వస్తున్నాయని తెలిపింది. అతను ఎవరన్న విషయం నాకు తెలియదని, నా మొబైల్ నెంబర్ తీసుకుని రోజు కాల్స్, మెసేజ్ లు చేస్తున్నాడని వాపోయింది.
ఇక ఇంతటితో ఆగకుండ ఎర్నాకుళంలోని ఉంటున్న నా ఫ్లాట్ కు అప్పడప్పుడు ఫుడ్ పార్శిళ్లతో ఏకంగా ఇంట్లోకి వస్తూ నానా హంగామా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఇటీవల సైతం అతని నుంచి వేదింపులు ఎక్కువవ్వడంతో భరించలేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి హర్షను అరెస్ట్ చేశారు. మరో విషయం ఏంటంటే.. పార్వతి తిరువొత్తుకి వేదింపులు కొత్తేమి కాదని, గత రెండేళ్ల క్రితం ఓ లాయర్ కూడా వెంటపడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి.