టీవీ షో చూడటానికి వెళ్లి సెలబ్రిటీలు అయినవారు చాలా తక్కువమంది ఉంటారు. ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. ఎంతో కష్టపడి సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంటారు. అలాంటివారు సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. బుల్లితెరపై కూడా కనిపిస్తుంటారు. అలా పటాస్ షో చూసి వెళ్దామని వచ్చి.. అదే షోలో టాప్ కమెడియన్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు యాదమ్మ రాజు. పెద్దగా చదువుకోలేదు.. కానీ, తనలో ఉన్న టాలెంట్ మొత్తం పటాస్ తో పాటు పలు పాపులర్ టీవీ షోస్ లో బయటపెట్టి.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక అదే పటాస్ షో ద్వారా పాపులర్ అయిన లేడీ కమెడియన్ స్టెల్లా రాజ్.
పటాస్ షోలోనే పరిచయమైన యాదమ్మ రాజు, స్టెల్లా ఒకరినొకరు ఇష్టపడి.. ఆ తర్వాత మెల్లగా ప్రేమలో పడి.. రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే.. వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు? అసలు వీరి లవ్ స్టోరీ ఎలా మొదలయ్యింది? అనే విషయాలు పక్కన పెడితే.. వీరి పెళ్లికి చాలామంది సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. కాగా.. పెళ్లి తర్వాత యాదమ్మ రాజు, స్టెల్లా ఇద్దరూ కలిసి టీవీ షోస్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టెల్లా పైచదువుల నిమిత్తం ఫారెన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజు, స్టెల్లా ఇద్దరు ఎయిర్ పోర్టులో హగ్ చేసుకొని ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం రాజు టీవీ షోస్ తో పాటు అడపాదడపా సినిమాలు కూడా చేస్తున్నాడు. మరి వీరి జంటపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.