Kantamaneni Uma Maheswari: ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె సోమవారం మధ్యాహ్నం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఉమామహేశ్వరి మరణంపై ఆమె కూతురు దక్షిత మాట్లాడుతూ.. ‘అనారోగ్య సమస్యలతో అమ్మ ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నాం. భోజన సమయానికి గదిలోంచి బయటకు రాకపోయే సరికి తలుపు తెరిచే ప్రయత్నం చేశాం. లోపలినుంచి బోల్ట్ పెట్టుకుని ఉంది’’ అని పేర్కొన్నారు. కుటుంబసభ్యులు అనుమానంతో తలుపు బద్దలు కొట్టి చూడగా ఉమామహేశ్వరి ఉరి వేసుకుని కనిపించారు.
ఆమె మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన గదిలోకి వెళ్లి తలుపు బిగించుకున్నట్లు సమాచారం. ఉమామహేశ్వరి మృతదేహానికి ఇప్పటికే పోస్టుమార్టం పూర్తయి, కుటుంబసభ్యులకు కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. ఆమె కూతురు దీక్ష ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Uma Maheswari: ఆత్మహత్య చేసుకున్న NTR కూతురు ఉమా మహేశ్వరి!