సాధారణంగా స్టార్ హీరోల సినిమాల నుండి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఫ్యాన్స్ ఇట్టే అలర్ట్ అయిపోతారు. వచ్చిన అప్డేట్ ని వైరల్ చేస్తూ.. కొత్తగా ఆకర్షణీయంగా ఏం కనిపించినా హాట్ టాపిక్ గా మార్చేస్తుంటారు. ప్రస్తుతం దళపతి విజయ్ నటించిన వారసుడు మూవీ వీడియో సాంగ్ కి సంబంధించి తాజాగా ఓ బ్యూటీ పేరు ట్రెండ్ అవుతోంది. ఈ ఏడాది విజయ్ హీరోగా వారసుడు మూవీ విడుదలై మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సంక్రాంతి బరిలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న వారసుడు మూవీ.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ నెలలోనే వారసుడు మూవీని అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక వారసుడు థియేట్రికల్ రన్ కలెక్షన్స్ తగ్గుముఖం పట్టడంతో సినిమా నుండి ఒక్కో వీడియో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కాగా.. తాజాగా సినిమా నుండి రంజితమే సాంగ్ రిలీజై యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ మాస్ బీట్ సాంగ్ లో విజయ్, రష్మికలతో పాటు చాలామంది సైడ్ డాన్సర్స్ హైలైట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సాంగ్ చివరలో హీరో విజయ్ పక్కనే(కుడివైపు రెడ్ కలర్ డ్రెస్) అమ్మాయి చాలా ఎనర్జిటిక్ గా షెహనాయ్ ఊది.. స్టెప్స్ ఇరగదీసింది. దీంతో ఇప్పుడు నెటిజన్స్ దృష్టంతా ఆ అమ్మాయి పైనే పడ్డాయి.
అలా ఆ డాన్సర్ పై కళ్ళు పడ్డాయో లేదో.. అప్పుడే ఆమె ఎవరు? ఆమె ఇన్ స్టాగ్రామ్ డీటెయిల్స్ ఏంటంటూ వివరాలు ఆరా తీసే పనిలో పడ్డారు ఫ్యాన్స్, నెటిజన్స్. మరి ఆ అమ్మాయి(డాన్సర్) ఎవరు అనే వివరాల్లోకి వెళ్తే.. ఆమె పేరు అంబికా కోహ్లీ. ఇన్ స్టాగ్రామ్ లో ఐడి ‘పటాకా’ అని పెట్టుకుంది. ముంబైకి చెందిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో దాదాపు లక్షకు పైగా ఫాలోయర్స్ ని కలిగి ఉంది. అలాగే డాన్స్ తో పాటు ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో నెట్టింట సెగలు రేపుతోంది. సినిమాలలో డాన్సర్ గా రాణిస్తూనే.. ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోందట అంబికా.
ప్రస్తుతం రంజితమే సాంగ్ లో విజయ్, రష్మికల పక్కన అంబికా చేసిన స్టెప్స్ హైలైట్ గా మారాయి. మరి ఈ డాన్స్ పటాకా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.