పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న దర్శకులు కొందరు మాత్రమే ఉంటారు. అలాంటి దర్శకుల జాబితాలో ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి టాప్ ప్లేస్ లో ఉంటాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. రాజమౌళి తెలుగువాడే అయినప్పటికీ, ఇప్పుడు ఆయన స్థాయి వేరు. రాజమౌళి అంటే పాన్ ఇండియా డైరెక్టర్.. రాజమౌళి అంటే ఒక బ్రాండ్ అనే స్థాయికి ఆయన ఎదిగారు.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా RRR సినిమా కోసమే ఎదురుచూస్తోంది. మార్చి 25న రిలీజ్ కానున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ పై అభిమానులలో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అయితే.. RRR సినిమాకి మేకింగ్(రూ.336 కోట్లు), జిఎస్టి అన్ని కలుపుకొని ఐదువందల కోట్లవరకు బడ్జెట్(పెట్టుబడి) అయినట్లు సమాచారం. రాజమౌళి సినిమా అంటేనే భారీ స్థాయిలో.. మొదలైనప్పటి నుండి విడుదలయ్యే వరకు బిజినెస్ స్ట్రాటజీ కూడా అలాగే ఉంటుంది.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి సిరీస్’ మొత్తంగా రూ.2300 కోట్లకు పైగా వసూళ్లను సాధించిందని తెలుస్తోంది. ఇప్పుడు RRR సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. తన సినిమాలతో వేలకోట్లు కలెక్షన్స్ రాబడుతున్న రాజమౌళి రెమ్యూనరేషన్ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. RRR సినిమాకి రాజమౌళి రెమ్యునరేషన్ తీసుకోలేదట. తాజా సమాచారం ప్రకారం.. రాజమౌళి సినిమా లాభాల్లో ముప్పైశాతం ఇవ్వాలనే డీల్ మాట్లాడుకున్నాడని సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. RRR సినిమా కలెక్షన్స్ 2 వేలకోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందులో బడ్జెట్ 500కోట్లు పక్కనపెడితే.. లాభంగా 1500కోట్లు మిగిలే అవకాశం ఉంది. లాభాలలో ముప్పై శాతం అంటే.. సుమారు రూ. 450కోట్లు రాజమౌళి రెమ్యూనరేషన్ ఉంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. ఇండియాలో ఏ స్టార్ హీరో కూడా ఇంతటి రెమ్యూనరేషన్ అందుకోవడం లేదనేది వాస్తవం. మరి రెమ్యూనరేషన్ పరంగా చూసుకుంటే.. RRR సినిమాకి రాజమౌళినే హీరో అనాలి. మరి రాజమౌళి రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.