దక్షిణాది భారతదేశంలో బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది ఢీ. తెలుగు బుల్లి తెరపై గత కొన్నేళ్ల నుంచి నడుస్తున్న ఈ షో ఎంతమంది డ్యాన్సర్ లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే ఢీ 1 నుంచి ఇప్పుడు ఢీ 13 వరకు చేరుకునే ఇటీవలె ఫైనల్ కూడా ముగిసిపోయింది. కాగా ఇటీవల జరిగిన ఢీ13 ఫినాలెకి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇందులో పాల్గొన్న ఆయన ఢీ 13 విన్నర్ గా కావ్య శ్రీని ఎంపిక చేశారు. అయితే ఈ రియాలిటీ షో తెలుగు ఈటీవీ ఛానెల్ లో ప్రసారమైంది. ఎప్పుడు రానంత టీఆర్పీ రేటింగ్ ఒక ఫైనల్ లో మాత్రం భారీగా నమోదవుతుంది. గతంలో ఢీ10 ఫినాలెకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఛీఫ్ గెస్టుగా వచ్చారు. అప్పుడు ప్రసారం అయిన ఈ షో ఏకంగా 13.9 గా టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోయి సత్తా చాటింది. ఎన్టీఆర్ రావడంతో ఇంత రేటింగ్ నమోదైందని ఎన్టీఆర్ అభిమానులు తెగ సంతోషపడ్డారు.
అయితే తాజాగా ఢీ 13కి ఛీప్ గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ వచ్చారు. ముందుగా అల్లు అర్జున్ రాకతో గత టీఆర్పీ రేటింగ్ లు దాటడం ఖాయమని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ సారి మాత్రం అవేవి కాకుండా కేవలం 7.82 టీఆర్పీ రేటింగ్ ను మాత్రమే నమోదు చేసుకుని గత టీఆర్పీ రేటింగ్ ను దాటలేకపోయింది. ఇక ఈ క్రమంలోనే బన్నీ, తారక్ ఫ్యాన్స్ మధ్య కొత్త చిచ్చు రాజుకుంటుంది ఎన్టీఆర్ ను ఏ హీరో కూడా అందుకోలేడని దీనికి తాజాగా నమోదైన ఢీ 13 టీఆర్పీ రేటింగే సాక్ష్యం అంటూ బన్నీ అభిమానులు కాలర్ ఏగరేస్తున్నారు. ఢీ 13 ఫినాలెలో కేవలం 7.82 టీఆర్పీ రేటింగే నమోదైందని అదే తారక్ వచ్చి ఉంటే గత రేటింగ్ లు దాటిపోయేదని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ముదరుతున్న ఢీ రేటింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.