మెగాస్టార్ చిరంజీవి ఊచకోత ఏ మాత్రం తగ్గడం లేదు. ‘వాల్తేరు వీరయ్య’గా బాక్సాఫీస్ ని ర్యాంప్ ఆడిస్తున్నారు. దీంతో రెండు రోజుల్లోనే అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇదే ఊపు కొనసాగితే మూడోరోజుకే రూ.100 కోట్ల మార్క్ దాటేయడం పక్కా అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి బాస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేస్తారని కన్ఫర్మ్ అయిపోతుంది. రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు రోజురోజుకు థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతూపోతుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే మరికొన్నిరోజుల్లో బాస్ తన కెరీర్ లో అత్యధిక వసూళ్లని సాధిస్తారని తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపించిన దర్శకుడు బాబీ, ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేశాడు. మెగాస్టార్ టైటిల్ దగ్గర నుంచి చిరు డ్యాన్సుల్లో గ్రేస్, కామెడీ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్.. ఇలా ఎంత చెప్పుకున్నా సరే రచ్చ రచ్చ అనేలా ఉంది. దానికి తోడు మౌత్ టాక్ కూడా ఫుల్ పాజిటివ్ గా రావడంతో.. సంక్రాంతికి రిలీజైన మిగతా సినిమాల కంటే ‘వాల్తేరు వీరయ్య’కే ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. తొలి రూ.55 కోట్లకుపైనే గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే రెండు రోజుల్లో చిరు సినిమా ఏ ఏరియాల్లో ఎన్నెన్ని కోట్లు వసూలు చేసిందనేది ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: రూ.43.90 కోట్లు (రూ.75.50 కోట్లు గ్రాస్) అని సమచాారం వినిపిస్తోంది. మరి చిరు మూవీ కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.