మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఎందుకంటే ఆయన చూడని హిట్, బాక్సాఫీస్ దగ్గర చూడని బ్లాక్ బస్టర్ లేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న ఆయన.. ఈ వయసులోనూ అదే ఊపు మెంటైన్ చేస్తున్నారు. అలా ఈసారి సంక్రాంతి బరిలో నిలిచ బ్లాక్ బస్టర్ కొట్టారు. కలెక్షన్స్ లో దుమ్ములేపుతున్నారు. తెలుగులో మాత్రమే కాకుండా విదేశాల్లోనూ సరికొత్త రికార్డులని సెట్ చేస్తున్నారు. అయితే ‘వాల్తేరు వీరయ్య’ గా ఎంటర్ టైన్ చేస్తున్న ఆయన.. మరో అరుదైన ఘనత సాధించారు.
ఇక విషయానికొస్తే.. రీఎంట్రీలో అన్ని సీరియస్ సినిమాలు చేస్తున్న చిరు, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి కమర్షియల్ ఎంటర్ టైన్ చేశారు. ఇందులో వింటేజ్ చిరు కామెడీ, డ్యాన్స్, ఫైట్స్ ఉండేసరికి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సీనియర్ హీరో అయినప్పటికీ కూడా చిరు.. కొన్ని రేర్ రికార్డ్సని సెట్ చేస్తున్నారు. అలా ‘వాల్తేరు వీరయ్య’తో సరికొత్త ఘనత సాధించారు. రిలీజైన మూడు రోజుల్లోనే రూ.108 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన వీరయ్య.. వారం గడిచినా సరే నిలకడగా కలెక్షన్స్ సాధిస్తూ వెళ్తోంది. ఇక ఏడోరోజు ఈ సినిమాకు రూ.4.85 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ మొత్తంతో చిరు, టాలీవుడ్ లో ఏ హీరోకు సాధ్యం కాని ఘనత సాధించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాని పరిశీలిస్తే.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ అగ్రస్థానంలో ఉంది. రూ.8.43 కోట్లు దక్కించుకుంది. ఆ తర్వాత బాహుబలి 2, సైరా నరసింహారెడ్డి, సరిలేరు నీకెవ్వరు, ఆర్ఆర్ఆర్, ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య వరసగా ఉన్నాయి. ఈ లిస్టు గానీ కరెక్ట్ గా పరిశీలిస్తే.. టాప్-7లో ఏకంగా మూడు చిరంజీవి సినిమాలు ఉండటం విశేషం. ఇక దీన్ని చూసిన మెగాఫ్యాన్స్.. ఇది చిరంజీవి రేంజ్ అని బల్లగుద్ది చెబుతున్నారు. ఇప్పట్లో ఈ రికార్డును మరో హీరో బీట్ చేయడం కష్టమేనని కూడా మాట్లాడుకుంటున్నారు. మరి చిరు నెలకొల్పిన రికార్డు చూసి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.