తెలుగు నాట ఉన్న యాంకర్లలో విష్ణుప్రియకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు యూత్‌లో ఫుల్ పాపులారిటీ ఉంది. అలాంటి విష్ణుప్రియ తనకు ముద్దు పెట్టే అవకాశం ఎప్పుడు వస్తుందోనని ఉడికిపోతున్నారు.
ప్రముఖ యాంకర్ విష్ణుప్రియకు ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, చలాకీదనం, మాటలు, డ్యాన్సులతో అభిమానుల్లో ఆమె ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. యూత్ ఆడియెన్స్‌లో విష్ణుప్రియ అంటే పడిచచ్చే వారు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె బాగా యాక్టివ్‌గా ఉంటారు. బోల్డ్ ఫొటో షూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంటారు. యువతకు నిద్ర పట్టకుండా చేస్తుంటారు. ఆమె అందాల ఆరబోతకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సందే. అలాంటి విష్ణుప్రియ బాలీవుడ్ స్టార్ కపుల్‌ను చూశాక.. తనలో దాగి ఉన్న కోరికలను బయటపెట్టారు. అలియా భట్, రణ్‌బీర్ కపూర్లకు వివాహమై ఏడాదైంది. ఈ సందర్భంగా క్లోజ్ ఫ్రెండ్స్‌కు వీళ్లు పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో రణ్‌బీర్ కారులో నుంచే అందరికీ కరచాలనం చేస్తున్నారు.
రణ్‌బీర్ అందరికీ కరచాలనం చేస్తున్న సమయంలో ఆయనకు ప్రేమగా ముద్దు పెట్టారు అలియా. ఈ విషయంపై విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ‘దేవుడా.. ఇలా ముద్దు పెట్టుకునే ఛాన్స్ నాకు ఎప్పుడు ఇస్తావ్’ అంటూ విష్ణుప్రియ అడిగేశారు. ఆమధ్య మ్యారేజ్ గురించి ఆమె కామెంట్స్ చేశారు. తన భర్త ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక అక్కినేని అఖిల్ అంటే తనకు వల్లమాలిన ప్రేమ, ప్రాణం అంటూ విష్ణుప్రియ ఊగిపోతుంటారు. కాగా, విష్ణుప్రియ ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో బిజీ అవుతున్నారు. మానస్‌తో కలసి ఆమె చేసిన ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే ‘జరీకట్టు’ అనే పాట హిట్టవ్వగా.. ఇప్పుడు ‘గంగులు’ సాంగ్ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.