ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన 'విరూపాక్ష'.. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఫుల్ హ్యాపీస్. ‘విరూపాక్ష’ సినిమాకు ఈ రేంజులో రెస్పాన్స్ వస్తుందని బహుశా కలలో కూడా అనుకుని ఉండడు. ఎందుకంటే 2021లో తేజ్ కి యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత హెల్త్ పరంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ విషయాన్ని రీసెంట్ గా చెప్పాడు. ఇలా వాటిని ఫేస్ చేస్తూనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశాడు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. వీర లెవల్ వసూళ్లు సాధిస్తోంది. ఈ విషయమే ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది.
అసలు విషయానికొస్తే.. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. దీనికి తాజా ఉదాహరణ ‘విరూపాక్ష’. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీకి రిలీజ్ కి ముందు పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. సుక్కూ మార్క్ స్క్రీన్ ప్లేకి తోడు సాయిధరమ్ తేజ్, సంయుక్తా మేనన్ యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా అన్ని కలిసొచ్చాయి. దీంతో కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఈ సినిమా దూసుకెళ్తోంది. చెప్పాలంటే సాయిధరమ్ తేజ్ గత చిత్రాల రికార్డుని బ్రేక్ చేసిందనే చెప్పాలి.
తొలిరోజు నార్మల్ టాక్ ఉండటంతో ‘విరూపాక్ష’కు కేవలం రూ.12 కోట్లు వచ్చాయి. శని-ఆదివారం మాత్రం చెరో రూ.16 కోట్లు చొప్పున వచ్చాయి. ఈ క్రమంలోనే వరసగా మూడు రోజుల వసూళ్లు పోస్టర్స్ ని నిర్మాణ సంస్థ అధికారికంగా ట్వీట్ చేసింది. సాయిధరమ్ తేజ్ గత చిత్రాలు ఏవి కూడా ఈ రేంజు వసూళ్లు సాధించలేదు. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 62 కోట్ల సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని ‘విరూపాక్ష’ చాలా సింపుల్ గా దాటేయనుందని క్లియర్ గా తెలుస్తోంది. సో అదన్నమాట విషయం. ‘విరూపాక్ష’ కలెక్షన్స్ చూస్తుంటే మీకేం అనిపిస్తోంది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
#Virupaksha‘s Craze at the Box-office is advancing SKY-HIGH with every growing day grossing 44CR by the 3rd Day 🥳🤩
Book your tickets for#BlockbusterVirupaksha 👇https://t.co/HzG8SAAGh7@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @SVCCofficial @SukumarWritings pic.twitter.com/188BiOMpAc
— SVCC (@SVCCofficial) April 24, 2023