ప్రస్తుతం మన ఇండస్ట్రీలో దగ్గుబాటి రానా, సాయిపల్లవిలది ప్రత్యేక శైలి. రోటిన్ కమర్షియల్ పాత్రల జోలికి వెళ్లకుండ.. తమలోని నటుడు, నటిని సంతృప్తి పరిచే పాత్రలకు మాత్రమే ఓకే చెప్తూ.. భిన్నమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకుల మదిలో తమదైన ముద్ర వేసుకున్నారు. ఇక వీరిద్దరూ జంటగా నటించిన సినిమా విరాట పర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు మూడేళ్ల నిరీక్షణ తరువాత జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవ్వబోతోంది. ఇందులో రానా, ప్రియమణి నక్సలైట్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ .. టీజర్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. జూన్ 17న సినిమా విడుదల ఉండటంతో.. ఆదివారం ఈసినిమా నుంచి సాలిడ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు టీమ్. ఈ ట్రైలర్‌లో నట విశ్వరూపంచూపించారు రానా, సాయి పల్లవి.
అయితే ట్రైలర్ ఈవెంట్‌ని చాలా భారీగా నిర్వహించాలని చిత్రబృందం భావిచింది. కానీ ప్రకృతి మాత్రం వారికి సహకరించలేదు. కర్నూలు ఔట్ డోర్ స్టేడియంలో ఈవెంట్ జరుగుతున్న సమయంలో హోరు గాలి భీభత్సం సృష్టించడంతో స్టేజ్ పైన ఉన్న ఎల్ఈడీ స్క్రీన్ పడిపోయింది. అయినప్పటికి కూడా సాయి పల్లవి, రానాలు అభిమానులను నిరాశపర్చకూడదతనే ఉద్దేశంతో రెండు మూడు నిమిషాలు మాట్లాడారు. సాయి పల్లవి మాట్లాడుతుంటే.. రానా గొడుగు పట్టుకున్నాడు. వర్షం కూడా పడడంతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మధ్యలోనే ఆగిపోయింది.
Despite of heavy rains…@RanaDaggubati & @Sai_Pallavi92 address the crowd.👏
#VirataParvamTrailer #VirataParvam pic.twitter.com/07db4yWVyH
— Suresh Kondi (@SureshKondi_) June 5, 2022
ఇది కూడా చదవండి: విరాటపర్వంలోని సాయిపల్లవి పాత్ర నిజ జీవితంలో ఈమెదే
ఇక విరాట పర్వం ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాయి పల్లవి యాక్షన్ సీక్వెన్స్‌లు చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఆమె ఫైరింగ్ చేసే విధానానికి అందరూ ఆశ్చర్యపోతోన్నారు. రొమాంటిక్, యాక్షన్ ఇలా అన్ని సీన్లలోనూ సాయి పల్లవి తన మార్క్ చూపించింది. మొత్తానికి విరాట పర్వం మాత్రం ట్రైలర్‌తో అంచనాలను అమాంతంగా పెంచేసింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Rana: సాయిపల్లవి కోసం తనని తాను తగ్గించుకున్న రానా! ఫోటో వైరల్