విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన డార్క్ యాక్షన్ డ్రామా చిత్రం ‘విక్రమ్’. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నర్ ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాలో స్టార్ హీరో సూర్య క్యామియో రోల్ చేశారు. అయితే.. కమల్ హాసన్ సినిమాలో ముగ్గురు స్టార్స్ ఉండేసరికి సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందులోనూ 1986లో విక్రమ్ మూవీకి, 2019లో వచ్చిన ఖైదీ సినిమాకు లింక్ ఉండటం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.
తాజాగా థియేట్రికల్ రిలీజై ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కమల్ హాసన్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి రికార్డు సెట్ చేసింది. అలాగే తమిళనాడులో లాక్ డౌన్ తర్వాత బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలలో 4వ స్థానంలో నిలిచింది. ఇక 2022 వరకు చూసుకుంటే వలిమై(36.17 కోట్లు), బీస్ట్(26.40 కోట్లు) తర్వాత 20.61 కోట్ల ఓపెనింగ్స్ తో టాప్ 3లో నిలిచింది విక్రమ్. కమల్ హాసన్ నుండి చాలా గ్యాప్ తర్వాత తెరమీదకి వచ్చిన సినిమా కావడంతో విక్రమ్ సినిమాకోసం ఫ్యాన్స్ అంతే ఆసక్తిగా ఉన్నారు. అదీగాక ఖైదీ, మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత లోకేష్ డైరెక్ట్ చేసిన సినిమా కావడం.. అందులోనూ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు చేయడం విశేషం.
ఇదిలా ఉండగా.. విక్రమ్ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ అయ్యింది. మరి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్ చూసినట్లయితే.. దాదాపు రూ. 48.68 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక వరల్డ్ వైడ్ ఏరియా కలెక్షన్స్ చూసుకుంటే..
తమిళనాడు – రూ. 20.61 కోట్లు
తెలుగు రాష్ట్రాలు – రూ. 3.74 కోట్లు
కర్ణాటక – రూ. 3.96 కోట్లు
కేరళ – రూ. 5.10 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 1.04 కోట్లు
ఓవర్సీస్ – రూ. 14.45 కోట్లు
మొత్తంగా రూ. 48.68 కోట్లు(గ్రాస్) వసూల్ చేసింది.
#Vikram WW Box Office
TN – ₹ 20.61 cr
AP/TS – ₹ 3.74 cr
KA – ₹ 3.96 cr
KL – ₹ 5.10 cr
ROI – ₹ 1.02 cr
OS – ₹ 14.25 cr [Reported Locs]Total – ₹ 48.68 cr
— Manobala Vijayabalan (@ManobalaV) June 4, 2022
ఈ విధంగా ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. అద్భుతమైన వసూళ్లు నమోదు చేసి పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సినిమాను నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ రిలీజ్ చేశారు. మరి కమల్ హాసన్ పాన్ ఇండియా స్థాయి విక్రమ్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.