Vikram: సినీ ఇండస్ట్రీ అంటే పూర్తిగా రంగుల లోకం మాత్రమే కాదు. ఇది మాయా లోకం కూడా. ఇక్కడ సక్సెస్ కావాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఇండస్ట్రీ ఒక్కో నటుడు.. ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోతాడు. ఇంకొంత మంది ఎన్ని సినిమాల్లో నటించినా మాత్రం గుర్తింపు దక్కించుకోలేరు. కానీ.. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే కళామతల్లి ఏదో ఒకరోజు ఆదరిస్తుంది. స్టార్ ని చేస్తుంది. ఇప్పుడు ఇందుకు సరైన ఉదాహరణగా నిలుస్తోంది తమిళ నటి వసంతి. నిజానికి వసంతి అంటే.. ఎవ్వరూ గుర్తు పట్టలేరు. కానీ.., విక్రమ్ మూవీలోని ఏజెంట్ టీనా అంటే మాత్రం ఇప్పుడు అంతా ఇట్టే గుర్తు పట్టేస్తారు. మాస్ ఆడియన్స్ అయితే విజిల్స్ వేస్తారు. ఇప్పుడు ఎక్కడ పట్టినా ఒక్కటే మాట. “ఏజెంట్ టీనా ఆంటీ గ్రేట్” !
( ఏజెంట్ టీనా పాత్రని ఇక్కడ రివీల్ చేయడం మూవీ స్పాయిలర్ కిందకి వస్తుంది. కాబట్టి.. ఇక్కడ స్పాయిలర్ అలెర్ట్ ఇస్తున్నాము.)
లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా విడుదలైన విక్రమ్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య.. ఇలా చాలా మంది స్టార్స్ నటించారు. అయితే.. వీరందరితో పాటు సమానంగా పేరు దక్కింది మాత్రం ఏజెంట్ టీనా పాత్రధారి అయిన వసంతికే. ఈ సినిమాలో ఏజెంట్ టీనా క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయి. సినిమా అంతా అమాయకమైన పని మనిషిగా కనిపించే టీనా.. ప్రీ క్లయిమ్యాక్స్ లో తన అసలు రూపాన్ని బయట పెడుతుంది. టీనా ఓ రా ఏజెంట్. తమ చీఫ్ విక్రమ్ కుటుంబానికి ప్రొటెక్టర్ గా ఆమె పని చేస్తూ ఉంటుంది. విక్రమ్ మనవడిని చంపడానికి వచ్చే విలన్స్ కి టీనా చుక్కలు చూపిస్తుంది. అప్పటి వరకు పని మనిషిగా టీనాని చూస్తూ ఉన్న ఆడియన్స్ కి కూడా..
ఆమె పోరాటం చూసి మైండ్ పోతుంది. అబ్బా.. ఇది కదరా ట్విస్ట్ అనిపించేలా ఏజెంట్ టీనా పాత్రని తీర్చిదిద్దాడు దర్శకుడు లోకేశ్ కనకరాజ్. ఏజెంట్ టీనా పాత్రకి ఇంత ప్రాముఖ్యత ఉండటంతో.. ఈ పాత్రలో నటించిన వసంతికి ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేసింది. తమిళ మీడియాలో ఇప్పుడు ఎక్కడ పట్టినా వసంతి పేరే వినిపిస్తోంది. ఆమె ఇంటర్వ్యూ కోసం యూట్యూబ్ ఛానెల్స్ పోటీ పడుతున్నాయి. అయితే.., వసంతికి ఈ సక్సెస్ రావడం వెనుక కొన్ని దశాబ్దాల నిరీక్షణ దాగి ఉంది. వసంతికి సినిమాలు అంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. జూనియర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో కనిపించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించినా ఆ పాత్రలు ఏవీ వసంతి కెరీర్ ను మలుపు తిప్పలేకపోయాయి.
అయితే.. విక్రమ్ మూవీ కోసం లోకేష్ కనకరాజ్ కి టీనా పాత్రకి ఓ ఆర్టిస్ట్ కావాల్సి వచ్చింది. చూడటానికి పని మనిషిలా ఉండాలి. కానీ.., కాస్త స్టంట్స్ చేసే సామర్ధ్యం ఉండాలి. అలాంటి ఆర్టిస్ట్ కోసం చూస్తున్న సమయంలో వసంతి వారి కంట పడింది. వసంతికి స్టంట్స్ రాకపోయినా మనిషి చాలా యాక్టివ్. పైగా.. సినిమా కోసం ఎంతటి కష్టానికి అయినా రెడీ. దీంతో. లోకేష్ కనకరాజ్ టీనా పాత్రకి వసంతిని ఫైనల్ చేసుకున్నాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ఏజెంట్ టీనా క్యారెక్టర్ కి ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. కొన్ని దశాబ్దాల వసంతి కల నెరవేరింది. అందుకే అంటారు. చేసే పనిలో మనసు పెట్టి, ఎలాంటి లోపం లేకుండా కష్టపడితే ఎప్పటికైనా ప్రతిఫలం దక్కుతుంది అని. చూశారు కదా ఇది ఏజెంట్ టీనా పాత్రధారి వసంతి సక్సెస్ జర్నీ. మరి.. ఈమె సక్సెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Chinmayi Sripada: అసభ్యంగా తాకుతూ అక్కపై తమ్ముడి వికృత చేష్టలు.. సమర్థించిన తల్లిదండ్రులు.. మండిపడ్డ సింగర్ చిన్మయి!