సినీ ఇండస్ట్రీలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ఆకట్టుకొని.. లవ్ బర్డ్స్ గా పాపులర్ అయిన జంట రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందాన. మొదటిసారి గీతగోవిందం సినిమాతో మంచి పెయిర్ గా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ – రష్మిక.. ఆ ఒక్క సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి, యూత్ కి బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత మళ్లీ డియర్ కామ్రేడ్ లో రెండోసారి జంటగా మెరిసి అలరించారు. సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. వీళ్ళ పెయిర్ కి మంచి పేరొచ్చింది. దాంతో కొన్నాళ్లుగా విజయ్, రష్మిక మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారు? అనే చర్చలు జరుపుతున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్. కానీ.. సినిమా ఏమోగానీ వీరి మధ్య స్ట్రాంగ్ లవ్ ట్రాక్ నడుస్తోంది అనేది మరో వాదన.
విజయ్, రష్మిక కలిసి చేసింది రెండు సినిమాలే అయినా.. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ సెట్ అయ్యిందని.. కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతూ వస్తున్నారు. అయితే.. ఇద్దరు కలిసి సినిమాలు చేయకపోయినా.. వేరే సినిమాలతో బిజీగా ఉన్నా.. రెగ్యులర్ గా మీట్ అవ్వడం, డిన్నర్స్ కి, టూర్స్ కి వెళ్లడం.. మొత్తానికి చెట్టాపట్టాలేసుకుంటూ తిరగడం మాత్రం జరుగుతూనే ఉంది. ఆ మధ్య ముంబైలో కనిపించిన ఈ జంట.. ఆ తర్వాత మాల్దీవ్స్ కి వెళ్లి కెమెరా కంట చిక్కారు. దీంతో ఇద్దరు డేటింగ్, లవ్ అంటూ కథనాలు గట్టిగా వినిపించాయి. కానీ, అవేవి నిజం కాదని, ఫ్రెండ్స్ మాత్రమే అని ఓ ఇంటర్వ్యూలో కొట్టిపారేసింది రష్మిక.
ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ మరోసారి ఫారెన్ టూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. విజయ్, రష్మిక ఇద్దరు రీసెంట్ గా దుబాయ్ టూర్ కి వెళ్లారు. ఈ ఇద్దరితో ఓ వ్యక్తి ఫోటో దిగుతున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మరోసారి విజయ్ – రష్మికల లవ్ ట్రాక్ మ్యాటర్ చర్చనీయాంశంగా మారింది. కానీ.. వీరిద్దరూ కలిసి దుబాయ్ ఎందుకు వెళ్లారనే విషయం తెలియాల్సి ఉంది. పర్సనల్ టూర్ లేదా ఏదైనా షూట్ కోసం వెళ్ళారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. కెరీర్ పరంగా విజయ్ ఖుషి సినిమాతో.. రష్మిక ‘పుష్ప 2’, యానిమల్ సినిమాలతో బిజీగా ఉంది. మరి విజయ్ – రష్మికల కెమిస్ట్రీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Dubai ??? @iamRashmika ❤️😊@TheDeverakonda ???
I thing its dubai ❤️😊
Anyways Nice clicks 👌😊Till the time our Inspiration #RashmikaMandanna is happy
We are also happy 😊Looking forward to see you both in one more Movie together ❤️😊#VijayDeverakonda pic.twitter.com/cd8D7ZUeB4
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) January 30, 2023