Aishwarya: సినిమా రంగం కూడా ఒక రకంగా జూదం లాంటిది.. స్టార్డమ్ ఉన్నపుడు కుప్పలు తెప్పలుగా అవకాశాలు వస్తాయి. అదే స్టార్డమ్ తగ్గిన తర్వాత ఎవ్వరూ పట్టించుకోరు. అప్పటివరకు సంపాదించిన డబ్బులు కొవ్వత్తిలా కరిగిపోయి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. కొంత మంది తమకు తెలిసిన వేరే పనులు చేసుకుని నెట్టుకొస్తారు. సినిమా మాత్రమే తెలిసిన వారు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. ఇది సినిమా ప్రపంచంలోని చీకటి కోణం. ముఖ్యంగా నటీమణుల విషయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. హీరోయిన్ల స్టార్డమ్ అన్నది మెరుపు తీగలాగా వచ్చిపోతుంటుంది. ఆ టైంలో సంపాదించుకున్నది కూడ బెట్టుకుంటే పర్లేదు. అలా చేయకపోతే పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ప్రస్తుతం ప్రముఖ నటి ఐశ్వర్య తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు కోలీవుడ్లో టాప్ హీరోయిన్గా.. తెలుగులో హీరోయిన్గా ఉన్న ఆమెను ఇప్పుడు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.
పూట గడవని పరిస్థితుల్లో సబ్బులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నాకు సరైన టైంలో అవకాశాలు రాలేదు. ఆదాయం కూడా లేదు. ఇంటి అవసరాలు తీర్చాలి. అందుకోసం సబ్బులు అమ్మి డబ్బులు సంపాదించాను. నాకు మంచి జీతం వస్తుందంటే పాచి పని చేయటానికి కూడా నేను రెడీ. నేను ఇప్పుడు చేస్తున్న పనిలో ఎంతో సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎలాంటి అప్పులు లేవు. మిగితా సమస్యలు కూడా లేవు. నాకు నలుగురు పిల్లలు.
వాళ్లను సాకాలంటే నా కాళ్ల మీద నేను నిలబడక తప్పదు. యోగా ప్రాక్టీస్ కారణంగా రోజుకు ఒక పూట భోజనం మాత్రమే తింటున్నా. కేవలం సీరియల్స్ కారణంగా నటిగా గుర్తింపు వస్తోంది. సినిమా తిండి పెట్టడం లేదు’’ అని చెప్పుకొచ్చారు. ఐశ్వర్య ఆర్థిక కష్టాలు సినీ పరిశ్రమలో వైరల్గా మారాయి. కాగా, నటి ఐశ్వర్య సీనియర్ నటి లక్ష్మి కూతురన్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య ‘పితామగన్’(శివపుత్రుడు) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనూ మంచిమంచి పాత్రలు చేశారు. అప్పుడప్పుడు కొన్ని తెలుగు టీవీ షోలలోనూ తలుక్కుమంటున్నారు. మరి, ఐశ్వర్య ఆర్థిక కష్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Chiranjeevi And Surekha Marriage: ఆ నటుడి సలహా వల్లే చిరంజీవి-సురేఖల వివాహం.. కలెక్టర్ సంబంధం కాదనుకుని!