ఇండస్ట్రలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ప్రస్థానం, హిస్టరీ ఉంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన ప్రస్థానాన్ని ప్రారంభించి... నేడు మెగాస్టార్‌గా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఇక కెరీర్ పరంగా ఆయన ఎంత సక్సెస్ఫుల్ పర్సనో.. వ్యక్తిగత జీవితంలో కూడా విజయవంతంగా రాణిస్తున్నారు. మంచి భర్తగా, తండ్రిగా నిలిచారు. పిల్లలపై ఆయన ఎంత ప్రేమ చూపుతారో.. ఇక భార్య సురేఖను కూడా అంతే గౌరవిస్తారు. ఆమె వల్లనే ఆయన కెరీర్లో ఇంత సక్సెస్ సాధించానని అనేక సందర్భాల్లో తెలిపారు. ఇక సురేఖ ఆయన తల్లి, తోబుట్టువులను పట్ల ఎంత బాధ్యతగా ప్రవర్తిస్తారో.. వారి కోసం ఎంత ఆలోచిస్తారో అనేక సార్లు తెలిపారు. తాను షూటింగుల్లో బిజీగా ఉన్నప్పటికి.. సురేఖ ఆయన బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వహిస్తారని చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అందరూ అంటారు. అయితే తాజాగా చిరంజీవి-సురేఖల వివాహానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. సురేఖను తొలుత ఓ కలెక్టర్‌కి ఇద్దామాని భావించారట ఆమె తండ్రి అల్లు రామలింగయ్య. కానీ ఓ నటుడి సలహా వల్ల చిరంజీవికి ఇచ్చి వివాహం చేశారట. ఇంతకు ఎవరా నటుడు వంటి వివరాలు మీ కోసం.. తన కూతురు సురేఖకి పెద్ద పెద్ద సంబంధాలు వస్తుండగా.. అప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశారు అల్లు రామలింగయ్య. ఇది కూడా చదవండి: Boycott Brahmastra: ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు.. గుడిలోకి చెప్పులేసుకుని వెళ్తారా.. బాయ్‌కాట్ బ్రహ్మస్త్ర! అయితే ఈ అనూహ్య నిర్ణయం వెనుక చాలా ఆలోచనలు జరిపారు అల్లు రామలింగయ్య. తనకి అత్యంత సన్నిహితుడు.. పాపులర్ నటుడు అయిన ప్రభాకర్ రెడ్డి సలహాతోనే చిరంజీవి- సురేఖల వివాహం జరిగిందనే విషయాన్ని బయటపెట్టారు ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త. చాలా ఏళ్ల తరువాత కెమెరా ముందుకు వచ్చిన ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త.. అల్లు రామలింగయ్య కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ.. చిరంజీవి-సురేఖల పెళ్లి ప్రస్తావన తీసుకుని వచ్చారు. ఈ సందర్భంలో తన భర్త ప్రభాకర్ రెడ్డి.. చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త మాట్లాడుతూ.. ‘అల్లు రామలింగయ్య మా ఫ్యామిలీకి బాగా క్లోజ్. సురేఖ పెళ్లి కోసం రెడ్డిగారితో చర్చించారు. నువ్ చెప్పు రెడ్డి బాబు.. సురేఖకి కలెక్టర్ సంబంధం రెడీగా ఉంది.. చిరంజీవి కూడా పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరికిచ్చి పెళ్లి చేయమంటావ్.. చిరంజీవా.. కలెక్టరా’’ అని అల్లు రామలింగయ్య ప్రభాకర్ రెడ్డిగారిని అడిగారు. ఇది కూడా చదవండి: Sunandha: వైరల్ అవుతున్న సీరియల్ నటి సునంద ఎంగేజ్మెంట్ ఫోటోలు! అందుకు ప్రభాకర్ రెడ్డి.. ‘‘పిల్లలకు మనం అన్నీ ఇస్తాం.. ఇప్పుడు కలెక్టర్ సంబంధం కూడా మంచిదే. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే.. అమ్మాయికి ఎవరు నచ్చితే వాళ్లని ఇచ్చి పెళ్లి చేయండి’ అని ప్రభాకర్ రెడ్డిగారు చెప్పారు. చిరంజీవి పైకి వస్తాడా అని అల్లు రామలింగయ్యగారు ఆలోచించారు.. ‘‘అమ్మాయి అదృష్టం బాగుంటే ఏదైనా జరుగుతుంది.. ఆమెకు ఇష్టమైతే పెళ్లి చేసేయండి’’ అని ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. చివరికి సురేఖ.. చిరంజీవిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అలా వాళ్ల పెళ్లి అయ్యింది. ఆమె అదృష్టం బాగుంది.. చిరంజీవిని పెళ్లాడింది. సురేఖ-చిరంజీవి పెళ్లి కోసం మేం కశ్మీర్ వెళ్లాం.. దాదాపు 15 రోజులు అక్కడే ఉన్నాం. ఈ పెళ్లి అనే కాదు.. మా పిల్లల పెళ్లి కూడా వాళ్ల ఇష్టానికే వదిలేశారు. మేం మద్రాస్‌లోనే ఉండేవాళ్లం.. అమ్మాయిలు హైదరాబాద్ వచ్చి అబ్బాయిని చూసుకునేవారు. నచ్చాడు అంటే చాలు.. మిగతా విషయాలు ఆయనే చూసుకునే వారు’ అంటూ చెప్పుకొచ్చారు ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త. చిరంజీవి-సురేఖల వివాహం గురించి ఆమె చెప్పిన ఈ సంగతులు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Kamal Haasan And Allu Arjun: కమల్ హాసన్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏదో తెలుసా?..