Kamal Haasan And Allu Arjun: భారత దేశం గర్వించ దగ్గ మేటి నటుల్లో లోకనాయకుడు కమల్ హాసన్ ఒకరు. నటన పరంగా ఆయన సాధించిన ఘనత మరువలేనిది. కమల్ హాసన్ నటన అంటే నచ్చని ఆర్టిస్టు ఉండరు. చాలా మంది ఆర్టిస్టులు ఆయనతో కలిసి ఒక్క సీన్లో అయినా నటించాలని పరితపిస్తుంటారు. లోకనాయకుడితో కలిసి నటించే అదృష్టం కొంతమందికి మాత్రమే దక్కింది. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఇక అల్లు అర్జున్ తన చిన్నతనంలో కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి ‘విజేత’ సినిమాతో పాటు కే.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్, రాధిక నటించిన అద్భుత కావ్యం ‘స్వాతి ముత్యం’లోనూ నటించారు. స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ మనవడిగా ఓ చిన్న రోల్ చేశారు అల్లు అర్జున్. సినిమా క్లైమాక్స్‌లో అల్లు అర్జున్ ఎంట్రీ ఉంటుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు ఎలా అవకాశం వచ్చిందంటే.. ఓ రోజు ‘స్వాతి ముత్యం’ సినిమా షూటింగ్ జరుగుతోందంట. ఆ సమయంలో షూటింగ్ స్పాట్‌కు అల్లు అరవింద్, అల్లు అర్జున్ వెళ్లారట. అల్లు అర్జున్‌ని చూడగానే.. ‘మీ అబ్బాయిని మా సినిమాలో ఒక్క చిన్న పాత్ర కోసం తీసుకోవచ్చా..కేవలం రెండు మూడు రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుంది’ అని విశ్వనాథ్ అడిగారట. విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకుడు అడిగే సరికి అరవింద్ కాదనలేకపోయారంట. అలా కమల్ హాసన్ మనవడి పాత్రలో అల్లు అర్జున్ కనిపించారు. ఆ తర్వాత తన నటనతో అంచెలంచెలుగా ఎదిగి నేడు ప్యాన్ ఇండియా స్టార్డమ్ తెచ్చుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘‘పుష్ప’’తో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ‘పుష్ప 2’ కోసం సౌత్ కంటే ఎక్కువగా.. నార్త్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి, కమల్ హాసన్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘స్వాతి ముత్యం’ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Nayanthara: నయనతారపై దర్శకుడి సంచలన ఆరోపణలు.. ‘‘డబ్బుల కోసం పెళ్లిని కూడా అమ్ముకుంది’’