సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయన తార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌ల పెళ్లి ఈ ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రసారం చేసే ఓటీటీ సంస్థలు.. తాజాగా నయన్-విఘ్నేష్ శివన్‌ల వివాహ వేడుక ప్రచార హక్కులకు భారీ ఆఫర్‌ను ప్రకటించి మరి సొంతం చేసుకున్నాయనే వార్తలు ప్రచారం అయిన సంగతి తెలిసిందే. నయనతార, విఘ్నేష్‌శివన్ వివాహ వేడుకల ప్రచార హక్కులను నెట్‌ప్లిక్స్ సంస్థ రూ.25 కోట్లకు కొనుగోలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ దర్శకడు వేలు ప్రభాకరన్ నయనతార వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమె 50 కోట్లకు తన పెళ్లిని అమ్ముకుంది అని తెలిపాడు. ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న వేలు ప్రభాకరన్ మాట్లాడుతూ.. ‘‘ఈ కాలంలో చిన్న చిన్న నటులు కూడా విలావాసంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. వ్యక్తిగత పర్యటనలకు, వెకేషన్స్‌కి వెళ్లడానికి ప్రత్యేక హెలికాప్టర్లను వాడుతున్నారు. ఇలాంటి వారందరూ అలనాటి హీరో ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఎంత సాదాసీదా జీవితం గడిపేవారో ఈతరం నటులు తెలుసుకోవాలి’’ అన్నారు. ఇది కూడా చదవండి: Nayanthara: పెళ్లికి రాని నయనతార తల్లి! పెళ్ళైన 5 రోజులకే పుట్టింటికి నయనతార! View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) ‘‘ఎంజీఆర్ తన బంధువులు, కుటుంబ సభ్యుల వివాహాలు అట్టహాసంగా జరపాలంటే.. ఇష్టపడేవారు కాదు. తాను సంపాదించిన సొమ్మంతా పేద ప్రజల నుంచి వచ్చిందే అని భావించేవారు. మరి ఇప్పుడు వివాహం చేసుకున్న యనతారను తీసుకొండి.. ఆమె తన వివాహాన్ని 50 కోట్లకు అమ్మకుంది. ఆమెకు ఆ హక్కు ఉంది. కానీ కొనుకున్నవాడు.. దాన్ని ప్రసారం చేసి ప్రేక్షకులు వద్ద నుంచి 500 కోట్లు సంపాపదిస్తాడు. ఆ తర్వాత ఇదే సంప్రదాయం అవుతుంది. మరో సెలబ్రిటీ.. ఇంతకన్నా గ్రాండ్‌గా వివాహం చేసుకుని.. మరింత ఎక్కువ ధరకు అమ్ముకుంటాడు. ఇలా ఎందుకు అంటే.. స్టేటస్ అంటారు. వీరు ప్రజలకు తమ విలాసాలను చూపించి.. దాన్ని కూడా డబ్బు చేసుకుంటున్నారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Nayanthara: కోట్లు సంపాదించిన నయనతార.. ఆస్తుల విలువ తెలిస్తే!