సూపర్ మార్కెట్‌కు వెళ్లిన అతడు అక్కడ అన్ని సరుకులతో పాటు అరటి పళ్లు కూడా కొన్నాడు. ఆ అరటి పళ్లను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత తినడానికి పూనుకున్నాడు. ఓ అరటి పండు ఒలిచి తింటున్న నేపథ్యంలో..
మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో ఎవ్వరమూ చెప్పలేము. అది ఏ రూపంలోనైనా వచ్చి మనుషుల ప్రాణాలు తీసేయవచ్చు. వాహనాలు, జీవులు, తోటి మనుషులు ఇలా ఏ రూపంలోనైనా అది మన దరి చేరవచ్చు. కానీ, భూమ్మీద నూకలు ఉంటే మాత్రం బతికి బట్టకడతాము లేదంటే మట్టిలో కలిసిపోతాము. తాజాగా, ఓ వ్యక్తిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సాలీడు రూపంలో ప్రమాదం పలకరించింది. కానీ, అతడి అదృష్టం బాగుండి క్షణాల వ్యవధిలో బయటపడ్డాడు. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌కు చెందిన క్రేగ్ హ్యారీసన్ అనే 35 ఏళ్ల వ్యక్తి నిత్యావసర సరుకులు కొనటానికి టెస్కో మార్కెట్‌కు వెళ్లాడు.
కూరగాయలు, సరుకులతో పాటు అరటి పళ్లు కూడా కొన్నాడు. కవర్లో ప్యాక్ చేసి ఉన్న వాటిని సరుకులతో పాటే ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఓ అరటి పండు తిందామని కవర్ విప్పాడు. ఓ అరటి పండును కవర్‌లోంచి బయటకు తీసి తింటూ ఉండగా ఓ భయంకరమైన దృశ్యం కనిపించింది. అరటి పళ్ల మధ్యలోంచి ఓ సాలీడు పరుగులు తీస్తూ బయటకు వచ్చింది. దాన్ని చూడగానే అతడు షాక్ తిన్నాడు. అది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సాలీడు. అది హట్స్‌మ్యాన్ జాతికి చెందింది. అది కరిస్తే మనుషుల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది.
అది కనపడగానే అతడు దాన్ని చంపే ప్రయత్నం చేశాడు. కానీ, అది తప్పించుకుని పారిపోయింది. అతడు ఆ కవర్‌లోని అరటి పళ్లను పరీక్షించి చూడగా.. వాటి మధ్యలో సాలీడు గుడ్లు కనిపించాయి. అతడు వాటిని తీసుకుని మార్కెట్ దగ్గరకు వెళ్లాడు. దీనిపై ఫిర్యాదు చేశాడు. మార్కెట్ యజమాన్యం అతడికి సారీ చెప్పింది. 100 డాలర్ల పరిహారం చెల్లిస్తానంది. మరి, అరటి పళ్ల మధ్యలో ఉన్న ప్రమాదరకరమైన సాలీడు నుంచి సదరు వ్యక్తి అదృష్టం కొద్ది తప్పించుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.