గత కొన్ని రోజుల నుంచి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. కమల్ హాసన్ 'ఇండియన్ 2' తెలుగు స్టార్ కమెడియన్ విలన్ గా చేస్తున్నాడని. ఇప్పుడు ఆ రూమర్స్ పై వెన్నెల కిశోర్ క్లారిటీ ఇచ్చేశాడు.
కమెడియన్స్ విలన్స్ గా మారడం ఎప్పటినుంచో ఉన్నదే. కాకపోతే మధ్యలో కొన్నాళ్లు ఆ ట్రెండ్ కు బ్రేక్ ఇచ్చారు. ఇకపోతే తెలుగులో ఎన్నో వందల సినిమాల్లో హాస్యనటుడిగా చేసి, క్రేజ్ తెచ్చుకున్న సునీల్.. ‘పుష్ప’ మూవీతో పూర్తిస్థాయి విలన్ గా మారిపోయాడు. పాన్ ఇండియా లెవల్లో ఫేమ్ సంపాదించాడు. ప్రస్తుతం తమిళంలోనే రజనీకాంత్, శివకార్తికేయన్ తోపాటు పలువురు హీరోలకు ప్రతినాయకుడిగా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రూట్ లోకి హాస్యనటుడు వెన్నెల కిషోర్ కూడా చేరారని న్యూస్ వచ్చింది. అది కూడా ‘విక్రమ్’ లాంటి హిట్ కొట్టిన కమల్ కొత్త సినిమాలో అనేసరికి అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు దీనిపై సదరు కమెడియన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఇక విషయానికొస్తే.. బ్రహ్మనందం, సునీల్, అలీ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ అంటే దాదాపు ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పేరు వెన్నెల కిషోర్. ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్న ఇతడు.. స్టార్ హీరోలకు ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కొంతమంది ఈ స్టార్ కమెడియన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో విలన్ గా మార్చేశారు. దీంతో వెన్నెల కిశోర్ ట్రెండింగ్ లో భాగమయ్యాడు. అసలు ఇంతకు ఈ స్టార్ కమెడియన్ ఏ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇచ్చాడో చూద్దాం.
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో ఏకంగా 7 గురు విలన్స్ ఉన్నారని గత కొన్నాళ్ల నుంచి రూమర్స్ వచ్చాయి. అందులో ఓ విలన్ గా వెన్నెల కిషోర్ చేస్తున్నారని మాట్లాడుకున్నారు. ఇదే విషయమై ఓ నెటిజెన్.. వెన్నెల కిషోర్ ని అడిగేశాడు. తనపై వచ్చే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ స్టార్ కమెడియన్ క్లారిటీ ఇచ్చేశాడు. ‘ఇండియన్ 2లో లేను.. పాకిస్థాన్ 3లోనూ నేను లేను’ అని చాలా ఫన్నీగా రీట్వీట్ చేశాడు. దీంతో రూమర్స్ కు ఎండ్ కార్డ్ పడినట్లయింది. మరి తనపై వచ్చిన వదంతులపై వెన్నెల కిషోర్ క్లారిటీ ఇవ్వడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Indian 2 lo lenu Pakistan 3 lo lenu pic.twitter.com/gJUmmoO9GG
— vennela kishore (@vennelakishore) February 28, 2023