టాలీవుడ్ లో కొన్నిసార్లు సినిమాల కంటే స్పీచులే ఎక్కువగా వివాదాల్లో నిలుస్తుంటాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య హీరో శర్వానంద్.. అందరూ షాకయ్యేలా మాట్లాడాడు. కమెడియన్ వెన్నెల కిశోర్ ని ‘ఆ నా కొడుకు’ అని అన్నారు. దీంతో స్టేజీపై ఉన్నవాళ్లే కాదు.. ప్రేక్షకుల కూడా ఆశ్చర్యపోయారు. అరే అలా అనేశాడేంట్రా అని అవాక్కయ్యారు. ఇప్పుడు ఆ స్పీచ్ కి కౌంటర్ గా వెన్నెల కిశోర్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. శర్వానంద్ కి సరైన హిట్ పడి చాలాకాలమైంది. మంచి నటుడే కానీ సినిమాలే బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతున్నాయి. అలాంటి శర్వానంద్ ఫైనల్లీ ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో హిట్ కొట్టేశాడు.టైమ్ ట్రావెల్ కి తోడు అమ్మ సెంటిమెంట్ ఇందులో ఉండటం, అది కూడా అర్ధమయ్యేలా చెప్పేసరికి ఆడియెన్స్ కి తెగ నచ్చేస్తోంది. ఇందులో హీరో శర్వాతోపాటు వెన్నెల కిశోర్, ప్రియదర్శి కీలకపాత్రలు పోషించారు. అమల తల్లిగా నటించారు.
ఇక రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్, వెన్నెల కిశోర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఆ నా కొడుక్కి ఈ సినిమాలో ఆఫర్ ఇప్పించాను. ఇప్పుడేమో ఈవెంట్ కే రాలేదు’ అని శర్వా అన్నాడు. ఇది ఫన్నీగానే అన్నాసరే యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ బీభత్సంగా వచ్చాయి. దీనికి వెన్నెల కిశోర్ బాగా హర్ట్ అయినట్లున్నాడు. శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్ లో హీరో శర్వానంద్ ని ఓ ఆటాడేసుకున్నాడు. ‘ఆ నా కొడుకు’ అని మొన్న నన్ను అన్నావ్.. ఈ రోజు దర్శిగాడు ఎక్కడా అని కిశోర్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఇదంతా కూడా చూడ్డాడానికి చాలా ఫన్నీగా అనిపించింది. మరి శర్వా-వెన్నెల కిశోర్ సంభాషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఒకే ఒక జీవితం సినిమా రివ్యూ & రేటింగ్!