సినిమా రంగంలో హీరోయిన్లకు ఎక్కువ కెరీర్ స్పాన్ ఉండదు. దీంతో వచ్చిన అవకాశానల్లా సద్వినియోగం చేసుకుంటూ.. చాలా జాగ్రత్తగా కెరీర్ కంటిన్యూ చేస్తుంటారు. కొంత మంది హీరోయిన్స్‌కి నటించాలని ఉన్నా అవకాశాలు లేక సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
సినిమా రంగంలో హీరోయిన్లకు ఎక్కువ కెరీర్ స్పాన్ ఉండదు. దీంతో వచ్చిన అవకాశానల్లా సద్వినియోగం చేసుకుంటూ.. చాలా జాగ్రత్తగా కెరీర్ కంటిన్యూ చేస్తుంటారు. కొంత మంది హీరోయిన్స్‌కి నటించాలని ఉన్నా అవకాశాలు లేక సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కట్ చేస్తే.. తనకు సినిమా ఆఫర్స్ కావాలంటూ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది బన్నీ హీరోయిన్ భానశ్రీ మెహ్రా. అల్లు అర్జున్ ‘వరుడు’ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భాను శ్రీ మెహ్రా.
‘గోవిందుడు అందరి వాడేలే’, ‘అలా ఎలా’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’, ‘మిస్టర్ ఇండియా’, ‘10th క్లాస్ డైరీస్’ లాంటి సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. హిందీ, తమిళ్, కన్నడ, పంజాబీ భాషల్లోనూ యాక్ట్ చేసింది భానుశ్రీ. ఇటీవల ‘ట్విట్టర్‌లో నన్ను బన్నీ బ్లాక్ చేశాడు’ అంటూ భానుశ్రీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. అప్పటి నుంచి తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో షేర్ చేసుకుంటుంది.
ఇప్పుడు మంచి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానంటూ ట్విట్టర్ వేదికగా పలు విషయాలు చెప్పుకొచ్చింది. నాకు సినిమా అవకాశాలు లేకపోవడంతో నేచర్‌తో ప్రయాణం చేస్తున్నాని, కొత్త ప్రదేశాలను సందర్శించడం, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ కోసం కంటెంట్ క్రియేట్ చేయడం తనకిష్టమని.. సినిమానే తన ట్రూ ప్యాషన్ అని, సినిమా సెట్స్‌ని బాగా మిస్ అవుతున్నానని, అలాగే మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేసింది.
Time for a little truth talk !
While I absolutely love travelling, exploring new places & creating content for Instagram / YouTube, I must confess that acting is my true passion & I really miss being on film sets. Eagerly waiting for some good acting opportunities 🙂 🤞 pic.twitter.com/FBZWpvoAqE— Bhanushree Mehra (@IAmBhanuShree) July 15, 2023