తాజాగా హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సుమంత్ పెళ్లిపై ట్విట్టర్ లో తన దైన శైలిలో స్పందించారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒక సారి అయ్యాక కూడా నీకు బుద్ది రాలేదా..? సుమంత్, ఇక నీ కర్మ. ఆ పవిత్ర కర్మ అనుభవించండి అంటూ ట్వీట్ చేశాడు.
ఇక వర్మ ట్వీట్ చేయడంపై కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు పలు రకాలుగా రిప్లై ఇస్తున్నారు. ఇక సమాజంలో ఏ అంశం మీదైన స్పందిస్తారు రామ్ గోపాల్ వర్మ. గత కొన్ని రోజుల నుంచి సుమంత్ మళ్లీ రెండో పెళ్ళికి సిద్దమయ్యారంటూ వార్తలు మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని కారణాల వల్ల సుమంత్ పెళ్లి చేసుకున్నారంటూ ఫిల్మ్ నగర్ లో చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఈ మధ్య సినిమాల్లో కూడా కనిపించడం లేదు సుమంత్. ఈ నేపథ్యంలోనే పెళ్ళి వార్తలు ముందుకొచ్చాయి.
Oka saari ayyaka kooda neekinkaa buddhi raaledha @iSumanth ? Nee kharma , aa pavitra kharma🙏 Anubhavinchandi 😒 pic.twitter.com/cfg2Zs5npg
— Ram Gopal Varma (@RGVzoomin) July 28, 2021