సంక్రాంతి అంటే కోడి పందెలు, పిండి వంటలు ఎంత కామనో.. స్టార్ హీరోల సినిమాలు కూడా అంతే కామన్. సొంతూరికి వచ్చి, బంధువులు అందరిని కలవడం, అలా వాళ్లందరితో కలిసి థియేటర్ కి వెళ్లి కొత్త సినిమా చూడటం అనే ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్నదే. ఇప్పుడు వాళ్ల కోసమే అన్నట్లు బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరు ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లలోకి వచ్చేశాయి. ప్రేక్షకుల్ని ఫుల్ ఆన్ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలైన వారిసు, తెగింపు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ రెండు మూవీస్ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తూ కోట్లకు కోట్లు కలెక్షన్స్ సాధిస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో ఈసారి బాలయ్య-చిరు మధ్య బాక్సాఫీస్ వార్ ఉన్నట్లు, తమిళనాడులో విజయ్-అజిత్ పోటీపడ్డారు. అయితే అజిత్ ‘తునివు’ మూవీ తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజైంది. కానీ విజయ్ ‘వారిసు’ మాత్రం పలు కారణాల వల్ల తెలుగు, హిందీ రిలీజ్ వాయిదా పడింది. తెలుగు వెర్షన్ జనవరి 14న విడుదల కానుంది. విడుదల పరంగా డిఫరెన్స్ ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర విజయ్ నే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా సినిమాలు రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ దీనికి ఉదాహరణగా కనిపిస్తున్నాయి.
విజయ్ ‘వారిసు’ సినిమా తొలిరోజు రూ.27 కోట్లు సాధించింది. రెండో రోజు రూ.19.2 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది. అజిత్ తునివు (తెలుగులో ‘తెగింపు’).. తొలిరోజు రూ.23 కోట్లు సాధించింది. రెండో రోజు వచ్చేసరికి రూ.14.2 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా చూసుకుంటే.. ‘వారిసు’ 2 డేస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ రూ.46.2 కోట్లతో ఉండగా.. ‘తునివు’ మాత్రం రూ.37.2 కోట్లతో చాలా దూరంలో ఉండిపోయినట్లు కనిపిస్తుంది. మరి ఈ సినిమాల అధికారిక వసూళ్లు బయటకొస్తే గానీ అసలు విషయం తెలీదు. మరి విజయ్-అజిత్ సినిమాల రెండు రోజుల కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.