సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్ల కుమారులు, కూతుళ్లు ఇండస్ట్రికి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. అందం అభినయం ఉన్న వరలక్ష్మి ఏ పాత్ర అయినా ఛాలెంజింగ్ గా తీసుకొని నటిస్తుంది. ప్రస్తుతం సౌత్ లో లేడీ విలన్ పాత్రల్లో ఎక్కువగా నటిస్తుంది.
సినీ ఇండస్ట్రీలో ఎంతో హీరోయిన్లు తమ గ్లామర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటారు. అందం.. అభినయం ఉన్నప్పటికీ హీరోయిన్ గా కాకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా నటించి మెప్పించేవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. గ్లామర్ రోల్స్ చేసేందుకు చాలా మంది హీరోయిన్లు ఇష్టపడతాను.. కానీ విలన్ గా నటించాలంటే ఎంతో గడ్స్ ఉండాలని అంటారు. ఈ కారణంతోనే లేడీ విలన్స్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో లేడీ విలన్ లోటు తీరుస్తుంది నటి వరలక్ష్మి. పలు చిత్రాల్లో లేడీ విలన్ గా నటించిన వరలక్ష్మి రీల్ లైఫ్ లో విలన్ గా కనిపించినా.. రియల్ లైఫ్ లో మనసు బంగారం అంటారు సన్నిహితులు. తాజాగా వరలక్ష్మి చేసిన గొప్ప పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు శరత్ కుమార్. ఆయన నటవారసురాలిగా ‘పోడా పోడి’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా నటించినా తర్వాత లేడీ విలన్ రోల్స్ లో నటించడం మొదలు పెట్టింది. అందం, అభినయం ఉన్న వరలక్ష్మి ఎక్కువగా రెబల్ తరహా పాత్రల్లో నటిస్తుంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన క్రాక్, వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది వరలక్ష్మి. నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు అంటారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ తన మంచి మనసు చాటుకుంటారు.
వరలక్ష్మి శరత్ కుమార్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నవారని ఎన్నోసార్లు ఆదుకుంది. తన పుట్టిన రోజు వేడుక సందర్బంగా మరోసారి గొప్ప మనసు చాటుకుంది. క్యాన్సర్ బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువులను అందించి వారికి అండగా నిలిచింది. శనివారం తన పుట్టిన రోజును డాక్టర్లు, క్యాన్సర్ బాధితుల మధ్యలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ.. క్యాన్సర్ బాధితులను కాపాడుతున్న వైద్యుల మధ్య తన పుట్టిన రోజు వేడుక జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.. మనకు అయిన వాళ్లు, స్నేహితులు క్యాన్సర్ భారిన పడితేనే ఆలోచిస్తున్నాం.. అలా కాకుండా క్యాన్సర్ భారిన పడిన వారి కుటుంబాలకు చేతనైనంత సహాయం చేస్తే ఎంతో బాగుంటుంది.. వారి జీవితాల్లో కొత్త వెలుగు వస్తుంది’ అని అన్నారు.