తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘వలిమై’. నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. జీ స్టూడియోస్‌తో కలిసి బే వ్యూ ప్రాజెక్ట్స్‌పై బోనీ కపూర్ ఈ మూవీని నిర్మించగా.. హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో తెలుగు యాక్టర్ కార్తికేయ విలన్‌గా నటించాడు. హ్యుమా ఖురేషి కీ రోల్ పోషించింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత అజిత్ నటించిన చిత్రం థియేటర్లో రిలీజ్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అజిత్ యాక్టింగ్, హీరో క్యారెక్టరైజేషన్, కార్తికేయ నటన సూపర్ అని పేర్కొంటున్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కి మంచి స్పందన వస్తుంది. ఏ హీరో ఫ్యాన్స్ అయినా.. అనందం వచ్చినా.. ఆవేశం వచ్చినా ఆపలేరు అంటారు. తాజాగా ‘వలిమై’ నిర్మాత పై ఫ్యాన్స్ క్రేజీగా తమ అభిమానం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిన్న ‘వలిమై’ మూవీకి నిర్మాత బోనీ కపూర్ నటి హ్యూమా ఖురేషితో కలిసి చెన్నైలో ఫస్ట్ డే ఫస్ట్ షో వీక్షించాడు. ఈ క్రమంలో తన కారును థియేటర్ బయట పార్క్ చేశాడు.
ఇది చదవండి: శివాజీ మూవీలోని ఈ సిస్టర్స్.. బయట ఎంత అందంగా ఉన్నారో చూడండి!తమ అభిమాన హీరో సినిమా నిర్మాత థియేటర్లో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. ఆయన కారుకు పాలాభిషేకం చేశారు. పాలు, పెరుగుతో నిర్మాత కారుకు అభిషేకం చేశారు. సినిమా చూసి బయటకు వచ్చిన బోనీ కపూర్ తన కారు స్థితిని చూసి మొదట షాక్ అయినా.. అంతా ఫ్యాన్స్ అభిమానం అని అదే కారులో వెళ్లిపోయారు.
Boney Kapoor will never Come for screening in Tamil Nadu 😂👍#Valimai wtf did these guys did to his car lmao 🤣 pic.twitter.com/2fzV9vZJWp
— “ (@KohlifiedGal) February 24, 2022