డార్లింగ్ ప్రభాస్.. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమాలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడు. అందరూ డార్లింగ్ అని ప్రేమగా పిలుచుకుని మురిసిపోతూ ఉంటారు. ఇంక బాహుబలి తర్వాత డార్లింగ్ కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రభాస్ అంటే పడిచచ్చిపోతారు. అందరికీ డార్లింగ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు.. ఎవరిని చేసుకుంటాడు అనే ప్రశ్నలే ఉండేవి. అయితే ఇన్నాళ్లూ ప్రభాస్ పెళ్లి రేపు, ఎల్లుండి అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.
కొన్ని రోజుల క్రితం అయితే ప్రభాస్- కృతిసనన్ డేటింగ్ లో ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ సినిమా ఇండస్ట్రీ కోడైకూసింది. అయితే తర్వాత కృతిసనన్ కూడా ప్రభాస్ తో రిలేషన్ పై కామెంట్ చేసింది. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. ఈ పుకార్లు రావడానికి కారణం.. భేడియా సినిమా ప్రమోషన్స్ సమయంలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యల వల్లే ఈ గాసిప్స్ పుట్టుకొచ్చాయి. తర్వాత ఇవి మరుగునపడ్డాయి.
ఇప్పుడు మరోసారి ప్రభాస్-కృతిసనన్ పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈసారి వారు కలిసి న్యూఇయర్ వేడుకలు జరుపుకోబోతున్నట్లు చెబుతున్నారు. అదికూడా ఇండియాలో కాదట.. మాల్దీవుల్లో వీళ్లు కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోనున్నట్లు ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్, ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. సెక్సియస్ట్ కపుల్ ప్రభాస్- కృతిసనన్ న్యూయర్ ను మాల్దీవుల్లో గడపనున్నారు అంటూ ట్వీట్ చేశాడు. అయితే గతంలో కృతి వదిన అంటూ ట్వీట్లు, సంబరాలు చేసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఈసారి మాత్రం చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. ఉమైర్ సంధుకు స్ట్రాంగ్ వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు.
నీకు ఇంక పనేమీ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరైతే వెళ్లి రెండు పాలప్యాకెట్లు వేసిరా అంటూ ఎద్దేవా చేస్తుండగా.. కొందరు మాత్రం ఇలాంటి వార్తలతో అయినా ఎంటర్ టైన్ చేస్తున్నావ్ అంటూ థాంక్స్ చెబుతున్నారు. ఇంక డార్లింగ్ సినిమాల విషయానికి వస్తే ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కే సినిమాలు రెడీ అవుతున్నాయి. మారుతీతో కలిసి రాజా డీలక్స్ సినిమా కూడా షూట్ స్టార్ట్ అయినట్లు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా సుకుమార్- ప్రభాస్ 2024లో పాన్ ఇండియా సినిమా తీయనున్నట్లు టాక్ మొదలైంది. ఇలా అన్ని భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు.
Sexiest Couple #Prabhas & #KritiSanon will spend their NewYear in 🇲🇻 Maldives.
— Umair Sandhu (@UmairSandu) December 26, 2022