బుల్లితెరపై ప్రోగ్రామ్ లు చేసే హడావుడి మాములుగా ఉండదు. ఒకప్పుడు టీవీలో సినిమాలు, సీరియల్స్ కి అధిక ప్రాధాన్యమిచ్చేవారు. కానీ.. రాను రాను ఇప్పుడు వాటికి బాగా ఆదరణ తగ్గింది. ఒక కొత్త సినిమా వేసినా రాని టీఆర్పీ రేటింగ్.. ఒక మంచి ప్రోగ్రాం నిర్వహిస్తే వస్తుంది. ఈ క్రమంలో "మిస్టర్ అండ్ మిస్సెస్" అనే కొత్త షో ప్రోమో చాలా సరదాగా, ఆసక్తిని కలిగిస్తూ రిలీజ్ అయ్యింది.
బుల్లితెరపై ప్రోగ్రామ్ లు చేసే హడావుడి మాములుగా ఉండదు. ఒకప్పుడు టీవీలో సినిమాలు, సీరియల్స్ కి అధిక ప్రాధాన్యమిచ్చేవారు. కానీ.. రాను రాను ఇప్పుడు వాటికి బాగా ఆదరణ తగ్గింది. ఒక కొత్త సినిమా వేసినా రాని టీఆర్పీ రేటింగ్.. ఒక మంచి ప్రోగ్రాం నిర్వహిస్తే వస్తుంది. ఇందులో సీరియల్ ఆర్టిస్టులు తళుక్కున మెరుస్తూ.. బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. సీరియల్లో చూసిన ఆర్టిస్టులు ఇలా సడన్ గా ప్రోగ్రాంలో కనిపించగానే అందరూ చాలా ఆసక్తికరంగా ఆ ప్రోగ్రామ్ లను చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రతి ఛానల్ కూడా మంచి ప్రోగ్రామ్స్ ని జనాలకు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో “మిస్టర్ అండ్ మిస్సెస్” అనే కొత్త షో ప్రోమో చాలా సరదాగా, ఆసక్తిని కలిగిస్తూ రిలీజ్ అయ్యింది.
ప్రోమో అంతా చాలా సరదాగా సాగింది. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేసిన ఈ షోలో.. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న రాకింగ్ రాకేష్, సుజాత జంట ఈ ప్రోమోలో హైలెట్ గా నిలిచారు. ముఖ్యంగా శ్రీముఖి, రాకేష్ ల మధ్య జరిగిన సంభాషణ జనాలను బాగా వినోదాన్ని పంచాయి. ఈ సందర్భంగా.. శ్రీముఖి రాకేష్ ని స్టేజ్ పైకి పిలిచి మీకేమైన టెన్షన్ ఉందా ? అని అడగ్గా.. ఇకపై ఈ షో తర్వాత మిమ్మల్ని కలవలేను అనే ఒక చిన్న బెరుకు ఉందని చెప్పాడు రాకేష్. దీంతో శ్రీముఖి నువ్వు సచ్చిపోతున్నావా లేక నేను సచ్చిపోతున్నానా? అని రాకేష్ మీద పంచ్ వేసింది. ఆ తర్వాత మీ హనీమూన్ కి ఎక్కడికి వెళ్లారు? అని శ్రీముఖి అడగ్గా.. మీ ఇంటికే వచ్చాము కదా! నువ్వు చెప్పలేదా.. అని అందరిని షాక్ కి గురి చేశారు రాకేష్ – సుజాత. ప్రస్తుతం వీరి సంభాషణలు నెటిజన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ షోలో శ్రీముఖి, రాకేష్ జంట చేసిన హడావుడి మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలుపండి.