బుల్లితెరపై పాపులర్ ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. ఎన్నో ఏళ్లుగా టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లాంటి షోస్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ మూవీని తెరమీదకు తీసుకొచ్చింది ప్రముఖ టీవీ ఛానల్ యాజమాన్యం. అయితే.. వారానికి ఓసారి ప్రసారమయ్యే ఈ షో.. త్వరలోనే వంద ఎపిసోడ్స్ కి దగ్గరపడుతుండటం విశేషం. ఇక సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ప్రారంభమైన ఈ షోని.. కొన్ని వారాలుగా యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తోంది. నటి పూర్ణ ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ప్రతివారం మాదిరే ఈ వారం కూడా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈసారి ‘జోడి నెం.1’ అనే కాన్సెప్ట్ తో ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. దీంతో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ లాంటి కమెడియన్స్ అందరూ ఒక్కొక్క అమ్మాయిని జోడిగా తీసుకొని గేమ్ లో పాల్గొన్నారు. ఇక పంచ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్ తమ రియల్ జోడితో సందడి చేశారు. ఈ నేపథ్యంలో రాకేష్, సుజాతతో డాన్స్ పెర్ఫార్మన్స్ చేసి అలరించాడు. కానీ.. పంచ్ ప్రసాద్ లైఫ్ లోని ఎమోషనల్ మూమెంట్స్ ని స్కిట్ లాగా చేసి అందరిని ఎమోషనల్ చేశారు. దీంతో ఆ స్కిట్ చూసి పంచ్ ప్రసాద్, అతని భార్య ఇద్దరు కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి పంచ్ ప్రసాద్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..