'జబర్దస్త్' యాంకర్ సౌమ్య బాగా ఫాస్ట్ అయిపోయింది. ఏకంగా జడ్జి కృష్ణ భగవాన్ కే వెళ్లి ముద్దుపెట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
తెలుగు ఎంటర్ టైన్ చేసే షో అనగానే దాదాపు ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పేరు ‘జబర్దస్త్’. ప్రతివారం టీవీ, యూట్యూబ్ ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకునే ఈ షోలో కామెడీ మాత్రమే కాదు చాలా ఉంటాయి. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు జనాల్లో ఈ షోపై కాస్త ఇంట్రెస్ట్ తగ్గిందనే చెప్పాలి. స్టార్ కమెడియన్స్ ఎవరూ లేకపోవడంతో ఒకరిద్దరి స్కిట్స్ మినహా షోని పట్టించుకునేవారు ఉండట్లేదు. దీంతో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు అలా చేసిన ఓ పని వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘జబర్దస్త్’ షో గురించి తెలుగువాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మధ్య కాలంలో రేటింగ్ కాస్త తగ్గుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ యాంకర్ సౌమ్యారావుతో పాటు జడ్జి కృష్ణ భగవాన్ అప్పుడప్పుడు పంచులతో ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి సెట్ లో ఉన్నవాళ్లందరికీ షాకిచ్చారు. ఎందుకంటే కృష్ణ భగవాన్ కు సౌమ్య ముద్దుపెట్టేసరికి ఒక్కసారిగా అవాక్కయ్యారు. పక్కనే ఉన్న మరో జడ్జి ఇంద్రజ వారించే ప్రయత్నం చేసినా సరే సౌమ్య అస్సలు ఆగలేదు.
తాజాగా రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ ప్రోమోలో భాగంగా నూకరాజు-ప్రసాద్.. మూకీ స్కిట్ చేశారు. కేవలం సైగలతోనే నవ్విస్తూ అలరించారు. అయితే ఇది పూర్తయిన తర్వాత నూకరాజు వెళ్లి కృష్ణ భగవాన్ చేతిపై ముద్దుపెట్టాడు. నువ్వు కూడా పెట్టు అన్నట్లు యాంకర్ సౌమ్యకి సైగ చేశాడు. దీంతో ఆమె వెళ్లగా.. ఇంద్రజ పాయింట్స్ బోర్డుని కృష్ణ భగవాన్ బుగ్గపై అడ్డుగా పెట్టింది. దీంతో చేసేదేం లేక.. చేతిపై ముద్దుపెట్టిన సౌమ్య తిరిగి తన ప్లేసులో వచ్చి కూర్చుండి పోయింది. అసలు పూర్తిగా ఏం జరిగిందనేది తెలియాలంటే మాత్రం వచ్చేవారం ఎపిసోడ్ టెలికాస్ట్ వరకు ఆగాల్సిందే. మరి సౌమ్య, కృష్ణ భగవాన్ కు ముద్దుపెట్టడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.