ఈ ఫొటోలో ఉన్న నటిని చూశారా! ఎంత అందంగా ఉందో.. ఆమె కళ్ళలోకి చూస్తుంటే ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆమె ముఖంలోని చిరునవ్వుని చూస్తుంటే ప్రపంచంలోని ఆనందమంతా ఆమె ఇంట్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అభిమానులను అలరించడం కోసం ఇంత అందంగా తయారై సోషల్ మీడియాలో తన ఫోటోను పంచుకుంది. ఈ ఫోటోలను చూసి ఎందరో లైక్ చేశారు.. మరెందరో కామెంట్స్ చేశారు. కానీ, ఫోటో పోస్ట్ చేసి 7 గంటలు కూడా గడవకముందే అనుకోని విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు అందరితో కలిసిమెలిసి తిరిగిన నటి అనూహ్యంగా విగతజీవిగా మారింది. షూటింగ్ స్పాట్ లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఏడు గంటల వ్యవధిలో ఏం జరిగింది? ఎందుకు చనిపోవాలనుకుంది? అన్న ఇప్పుడు చూద్దాం..
తునీషా శర్మ ఆత్మహత్య చేసుకోవడానికి 7 గంటల ముందు పెట్టిన ఫోటో చూస్తుంటే.. చేతిలో డైలాగ్ పేపర్ పట్టుకొని చాలా మౌనంగా కనిపిస్తోంది. ఆమె మొహంలో ఎక్కడా ఆనందం కనిపించట్లేదు. వరుస షూటింగ్ లతో బిజీ బిజీగా గడిపే తునీషా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనికుంది. ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా? కుటుంబసభ్యులతో ఘర్షణ పడిందా? లేదంటే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే.. ఆమె 7 గంటల క్రితం పెట్టిన ఇన్స్టా స్టోరీ చూస్తుంటే చాలా సంతోషంగా మేకప్ వేయించుకుంటోంది. ఇంత సంతోషంగా ఉన్న నటి ఆత్మహత్య చేయుకుందంటే ఎవరు నమ్మరు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Actor Tunisha Sharma’s last Instagram story which she had posted hours before she committed suicide pic.twitter.com/zGHCpiTDCO
— Free Press Journal (@fpjindia) December 24, 2022
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన తునీషా శర్మ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’ సీనియల్‌లో తొలిసారి నటించింది. ప్రస్తుతం సోనీ సబ్ టీవీలో ‘అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్’లో కీలక పాత్రను పోషిస్తోంది. ఈ సీరియల్ షూటింగ్ లోనే ఈ విషాదం చోస్తుచేసుకుంది. మేకప్ రూంలోకి వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటకి రాకపోవడంతో.. సిబ్బంది వెళ్లి చూడగా అప్పటికే.. వాష్ రూంలో ఉరేసుకొని కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. తునీషా శర్మ.. చక్రవర్తి అశోక్ సామ్రాట్, మహారాణా ప్రతాప్, అలీబాబా వంటి పలు సీరియల్స్ తో పాటు దబాంగ్ 3, కహానీ 2 వంటి చిత్రాల్లోనూ నటించింది.