దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తెలుగు చిత్ర ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. ఇక ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది మరువకముందే తాజాగా తమిళ యువ నటి దీప పౌలిన్ ఆత్మహత్య చేసుకుంది. చెన్నై విరుగంబాక్కంలోని తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని దీప సూసైడ్ నోట్ లో పేర్కొనడం విశేషం.ఆమె మృతితో తమిళ్ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గత కొంత కాలం నుంచి ఆమె ప్రేమలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆమె ఆత్మహత్యకు మానసిక ఒత్తిడి, ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని దీప స్నేహితులు తెలిపారు. దీని కారణంగానే దీప కొన్ని రోజుల నుంచి మీడియాకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. నటి దీప ఆత్మహత్యపై స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఆస్పత్రికి తరలించారు. ఇక అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా ఇటీవల విడుదలైన వైధా చిత్రంలో దీప హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఉన్నట్టుండి తమిళ యువ నటి ఆత్మహత్య చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.