సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలు హీరోయిన్స్ గా కెరీర్ సాగించడం అనేది ఎంతో క్లిష్టమైంది. నటిగా పరిశ్రమలో నెట్టుకురావాలంటే ఎన్నో ఒడిదుడుకులను, ఊహించని పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదీగాక ఎప్పటినుండో ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే.. అది కాస్టింగ్ కౌచ్. దీని కారణంగా ఎందరో ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఎదగాలని కలలుగన్న మోడల్స్, అమ్మాయిల కెరీర్లు కోల్పోయారు. అయితే.. కొన్నేళ్ల కిందట మొదలైన ‘మీటూ’ ఉద్యమంతో పరిశ్రమలో స్ట్రగుల్ అవుతున్న హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకు జరిగిన అన్యాయాలను నిర్భయంగా బయటపెట్టారు.
ఆ మీటూ ఉద్యమం ఊపులోనే అంతా అయిపోతుందని భావించారు. కానీ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇంకా అలాగే కొనసాగుతుందని చెప్పి సంచలనం రేపింది నటి అశిత. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు షాకింగ్ విషయాలను షేర్ చేసుకుంది. మీటూ ఉద్యమం వచ్చాక ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ తగ్గిందని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఇంకా పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొందరు పెద్దల చేతుల్లోనే ఉంది. ఇంకా వాళ్లే చక్రం తిప్పుతున్నారు. వారు చెప్పినట్లే నడుచుకోవాల్సి వస్తోంది. ఇండస్ట్రీలో పడక సుఖం అందించకపోతే సర్వైవ్ కాలేని పరిస్థితి కంటిన్యూ అవుతోంది.
ఈ నేపథ్యంలో వారు చెప్పినట్లు పడక సుఖం ఇవ్వకుంటే ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తారని చెప్పుకొచ్చింది అశిత. ఆ విధంగా కెరీర్ కోల్పోయిన వారిలో నేను కూడా ఉన్నాను. నా కెరీర్ కూడా ఆ ఊబిలోనే నాశనం అయ్యింది. నన్ను చాలామంది పడక సుఖం కోసం సంప్రదించారు. కానీ.. నేను టాలెంట్ ని నమ్ముకొని వచ్చాను కాబట్టి అందుకు ఒప్పుకోలేదు. దీంతో నాకు ఎక్కడా అవకాశాలు రాలేదు. అవకాశం కోసం ఎక్కడికి వెళ్లినా నాకు కాస్టింగ్ కౌచ్ సమస్యే ఎదురైంది. వాళ్ళు అడిగినదానికి నేను ఒప్పుకోకపోవడం వల్లే నేను ఇండస్ట్రీకి దూరమయ్యాను. బహుశా పడక సుఖానికి లొంగి ఉంటే నాకు అవకాశాలు వచ్చి ఉండేవేమో” అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది అశిత. కానీ.. వారెవరూ అనే పేర్లు వెల్లడించలేదు. ప్రస్తుతం అశిత మాటలు శాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.