సినిమా ఇండస్ట్రీ, సినిమాల్లో హీరోలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అభిమాన గణం కూడా హీరోలకే ఎక్కువగా ఉంటుంది. అయితే హీరోలకు అభిమానులు ఉంటే హీరోయిన్లకు భక్తులు ఉంటారు. తమ అభిమాన హీరోయిన్లకు గుడులు కట్టించడం కూడా చూశాం. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి. అటు హీరోయిన్లకు కూడా సమానంగానే గుర్తింపు లభిస్తోంది. అలా సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్‌లో గుర్తింపు సాధించిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారికి సంబంధించిన ఏ వార్త అయినా నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్లకు సంబంధించిన చిన్నప్పటి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
అలా ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా తక్కువ స్పాన్‌లోనే ప్రేక్షకుల మన్ననలు పొందిన హీరోయిన్ కృతి శెట్టి. ఈ కన్నడ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ హోదాని సొంతం చేసుకుంది. ఉప్పెన సినిమాతో కృతిశెట్టి టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమాలోనే ఎంతో పరిణతి చెందిన నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత మరో సూపర్ హిట్ సినిమాలో అవకాశం సంపాదించడం తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని సినిమా శ్యామ్ సింగరాయ్‌లో సూపర్ రోల్‌లో నటిచింది. ఉప్పెనలో లంగాఓణీలో హోమ్లీగా కనిపించిన ఈమె.. శ్యామ్ సింగరాయ్‌లో జీన్స్ వేసి మోడ్రన్ టచ్ ఇచ్చింది. క్లాస్ అయినా మోడ్రన్ అయినా రెండు పాత్రలు చేయగలదని నిరూపించుకుంది.
తర్వాత అక్కినేని నాగార్జున, నాగ చైతన్యలతో కలిసి బంగ్గార్రాజు సినిమాలో నటించింది. యువ సర్పంచ్‌గా తన నటనతో అందరినీ మెప్పించింది. రామ్‌తో కలిసి వారియర్, నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబుతో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. 2021- 2022 రెండు సంవత్సరాల్లోనే తెలుగులో మొత్తం 6 సినిమాల్లో నటించింది. వారియర్ సినిమాని తెలుగు, తమిళ్‌లో కూడా విడుదల చేశారు. ఆ సినిమాతో కృతిశెట్టి అటు తమిళ ప్రేక్షకులను కూడా పలకరించింది. రాబోయే రోజుల్లో అవకాశాలను బట్టి తమిళ్ లో కూడా సినిమాలు చేసేందుకు కృతి సిద్ధమవుతోంది.
కృతిశెట్టి అటు మలయాళం ప్రేక్షకులను కూడా పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘అజయంతే రందం మోషనం’ అని టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో తొవినో థోమస్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. అతని సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా మలయాళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా మందికి కృతిశెట్టి ఉప్పెన సినిమా నుంచే తెలుసు. అయితే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఒక సినిమా చేసింది. అది కూడా అల్లాటప్పా హీరోతో కాదు.. బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ సినిమాలో. హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 అనే రియల్ లైఫ్ బేస్డ్ సినిమాలో కృతిశెట్టి ఓ స్టూడెంట్ పాత్రలో మెరిసింది.