ఈ మధ్యకాలంలో సినిమా హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఆ చిన్ననాటి ఫోటోలను చూసిన అభిమానులు వారిని కనిపెట్టేందుకు అనేక తంటాలు పడుతున్నారు. ఇకపోతే పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో అన్న సంగతి మీకు తెలుసా? అసలు ఈ బుడ్డుడో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎవరు అనే కదా మీ ప్రశ్న. ఇది తెలియాలంటే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే.
బాల్యంలో ఉన్నప్పుడు ప్రతీ ఒక్కరికి ఒక్కో తీపి గుర్తులు మిగిలి ఉంటాయి. అవి రూపంలో అయిన ఉండొచ్చు. అలాంటి తీపి గుర్తులే మన టాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా ఉన్నాయి. ఇలా ఎంతో మంది స్టార్ హీరోల ఫోటోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఇక విషయానికొస్తే పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ బుడతడు ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇతడే కాదండోయ్.. ఇతని తండ్రి, తమ్ముడు కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలుగా రాణిస్తుండడం విశేషం. ఇక ఇదే కాకుండా ఇతని తండ్రి నాన్న కూడా గతంలో ప్రముఖ నటుడిగా ఓ వెలుగు వెలిగి కాలం చేశారు. అయితే ఫోటోలు కనిపిస్తున్న ఈ చిన్నోడికి ఇప్పుడు అమ్మాయిల ఫోలోయింగ్ కూడా బాగానే ఉంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో గ్యాప్ లేకుండా చిత్రాల్లో నటిస్తూ ఈ హీరో తెగ బిజీగా మారిపోయాడు.
ఇంతటి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో ఎవరో కాదండోయ్.. అక్కినేని నాగచైతన్య. అవును మీరు విన్నది నిజమే. అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చిన ఈ యువ మన్మధుడు అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి నటుడిగా మంచి మార్కులే కొట్టేశాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? ఈ రోజు అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు కావడం విశేషం. దీంతో టాలీవుడ్ లోని చాలా మంది నటులు నాగ చైతన్యకు బర్త్ డే విశేష్ తెలియజేశారు. అయితే నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా నాగ చైతన్య నటిస్తున్న కస్టడీ మూవీ నుంచి మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ మూవీకి తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు.