సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్టులకు చాలా మంది నటీ, నటులు వస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్లుగా, హీరోలుగా ఇండస్టీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. గతంలో ఇంద్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన తేజ సజ్జ.. నేడు హీరోగా ఏకంగా పాన్ ఇండియా సినిమానే చేస్తున్నాడు. ఇక గంగోత్రి మూవీ చైల్డ్ ఆర్టిస్టు కూడా తాజాగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలోకి చేరబోతోంది మరో చైల్డ్ ఆర్టిస్ట్ గ్రీష్మ నేత్రిక. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఏమో గుర్రం ఎగరవచ్చు, మల్లీశ్వరి, పంచాక్షరి, బాలకృష్ణ నటించిన మహానాయకుడు లాంటి 30 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది గ్రీష్మ.
సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ నటించిన ‘అమ్ములు’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది గ్రీష్మ. 2003లో విడుదలైన ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించింది. ఇక ఈ చిత్రంలోని నటనకు గ్రీష్మకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో వరుసగా ఆఫర్లు రావడంతో.. దాదాపు 30 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది గ్రీష్మ. ఆ తర్వాత చదువు కోసం క్రమంగా సినిమాలకు దూరం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఓ మంచి ప్రాజెక్ట్ కోసం గ్రీష్మ వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. కుర్రాల గుండెలను కొల్లగొడుతోంది. సమయం చిక్కినప్పుడల్లా పద్దతైన తన అందాలతో యువతకు నిద్రను దూరం చేస్తోంది ఈ సోయగం. ఇక గ్రీష్మ ఫొటోలను చూసిన నెటిజన్లు.. హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోని అందం గ్రీష్మ సొంతం. దాంతో తను కూడా ఇండస్ట్రీకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.