నటీమణులు హీరోయిన్‌గా సరైన గుర్తింపు రాకపోవడంతో చిన్న క్యారెక్టర్లు చేసి అలరిస్తుంటారు. ఆ క్యారెక్టర్లు కూడా చాన్నాళ్లు అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుంటాయి. ఆమె తెరమీద కనిపించనంత సేపు.. పెద్దగా పట్టించుకోని ప్రజలు తర్వాత టీవీల్లో ఆ సినిమా చూసినప్పుడు అరే ఈ అమ్మాయి ఇప్పుడేమయ్యింది అని వెతుకుతుంటారు.
నటీమణులు హీరోయిన్‌గా సరైన గుర్తింపు రాకపోవడంతో చిన్న క్యారెక్టర్లు చేసి అలరిస్తుంటారు. ఆ క్యారెక్టర్లు కూడా చాన్నాళ్లు అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుంటాయి. ఆమె తెరమీద కనిపించనంత సేపు.. పెద్దగా పట్టించుకోని ప్రజలు తర్వాత టీవీల్లో ఆ సినిమా చూసినప్పుడు అరే ఈ అమ్మాయి ఇప్పుడేమయ్యింది అని వెతుకుతుంటారు. అటువంటి వారిలో ఈ చిన్నది కూడా ఒకరు. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాలు ఉండవు అనే రూమర్లను నిజం చేసేలా ఆమె కెరీర్ ఉండటం గమనార్హం. తెలుగు నాట పుట్టిన ఈ చిన్నది మలయాళ పరిశ్రమలో ఒకప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారింది. ఇంతకు ఆమె ఎవరంటే లక్ష్మీ లహరి అలియాస్ లక్ష్మీ శర్మ.
ఈ పేరు చెబితే ఎవ్వరు గుర్తు పట్టరు కానీ.. ఇంద్ర సినిమాలో చిరంజీవి మేనకోడలు నందినీ అంటే ఠక్కున గుర్తు పడతారు. ఆమె తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. ఇక్కడ సరైన గుర్తింపు రాకపోవడంతో మలయాళం పరిశ్రమకు వెళ్లిపోయారు. 2000లో వచ్చిన అమ్మో ఒకటో తారీఖు సినిమాలో ఎల్బీ శ్రీరామ్ చిన్న కూతురుగా నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. సారీ నాకు పెళ్లైంది, ఆరుగురు పతివ్రతలు వంటి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే అవకాశాలు కూడా లేకపోవడంతో.. ఇక లాభం లేదనుకుని మాలీవుడ్ వైపు దృష్టిసారించింది. మమ్ముట్టితో కలిసి పలన్కు అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆమె వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
అక్కడ వరుస హిట్లతో టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. ఒకానొక సమయంలో అవకాశాల కోసం పలు అండర్ రేటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. అలా మలయాళంలో దూసుకెళుతూ ..ఇప్పటికీ నటిస్తూనే ఉంది. అలాగే తెలుగు, మలయాళంలో భక్తి కథ సీరియల్స్‌లోనూ మెప్పించింది. ప్రస్తుతం ఆమె కొన్ని ప్రత్యేకమైన క్యారెకర్లలో కనిపిస్తుంది. మలయాళ స్టార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ నుండి రాబోతున్న ఆడుజీవితం సినిమాలో ఆమె కూడా నటించింది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా, అంచనాలు పెంచేశాయి. పొట్టకూటి కోసం సౌదీకి వెళ్లే భారతీయలు ఎన్నికష్టాలు పడుతున్నారో ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రం ఈ అక్టోబర్‌లో విడుదల కానుంది. అలాగే ప్రభాస్.. ప్రశాంత్ నీల్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న సలార్‌లో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు పృథ్వీ.