టాలీవుడ్ హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్టు ఆఫీస్ లో విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ చోరీపై విష్టు మేనేజర్ సంజయ్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల ప్రకారం ఈ నెల 17న ఫిల్మ్ నగర్ లోని మంచు విష్టు ఆఫీస్ లో ఉన్న రూ.5 విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరీకి గురయ్యింది. మంచు విష్టు వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను ఈ చోరీ పాల్పడి ఉంటాని విష్టు మేనేజర్ తెలిపాడు. చోరీ జరిగిన తరువాత నుంచి నాగ శ్రీను కనిపించడం లేదని, ఫోన్ చేసిన అదుబాటులో లేదని సంజయ్ తెలిపాడు. దీంతో విష్ణు వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సంజయ్ ఫిర్యాదు చేశాడు. బోరబండలో నివాసం ఉండే శ్రీను కొంతకాలంగా హీరో మంచు విష్టు వద్ద వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ గా పని చేస్తున్నాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణచేపట్టారు. మరి ఈ విషయమై మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి.మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.