ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ వరుసగా టాప్ హీరోస్ సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. ‘కిక్’ సినిమాతో సంగీత ప్రపంచంలో కొత్త సౌండింగ్ కి నాంది పలికిన తమన్ – స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదరగొడతాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి తమన్ అందించిన సంగీతం ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫోటోగ్రాఫర్ గా మారాడు.
వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పైగా 10 కి పైగా సినిమాలకి సంగీతం అందిస్తున్నాడు. ఫోటోగ్రాఫర్ గా మారేంత టైం అతనికి ఎక్కడ ఉంది?’ తమన్ నిజంగా ఫోటో గ్రాఫర్ గా మారలేదు. ట్విట్టర్ ఖాతా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అతను సినిమా సెట్స్ లో ఉన్న హీరోలను దర్శకులను అద్భుతంగా ఫోటోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా అతను హీరో అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అతని ట్విట్టర్ ఖాతాకి 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఫోటోలు యిట్టె వైరల్ అయిపోతున్నాయి. అల్లు అర్జున్ సన్ షైన్ లో మెరుస్తున్న ఫోటోకి అతని అభిమానులు తెగ లైక్ లు కొడుతున్నారు.అలాగే త్రివిక్రమ్ ఫోటో కూడా ఆయన అభిమానులని ఆకట్టుకుంటుంది. ఇవి ‘అల వైకుంఠపురంలో’ మూవీ సెట్స్ లోని ఫోటోలను స్పష్టమవుతుంది. అలాగే వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ల రేర్ పిక్స్ ను కూడా తమన్ పోస్ట్ చేసాడు.
Jus my clicks of dear brother @alluarjun ❤️ pic.twitter.com/BcRlC8IiDF
— thaman S (@MusicThaman) June 16, 2021
Hey guys !! @Trivikram_Fans ❤️ pic.twitter.com/ZebPF9BmYR
— thaman S (@MusicThaman) June 16, 2021