సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య పోటీ అనేది ఉండదు.. కానీ ఒకే సమయంలో వారి పాటలు, సినిమాలు వచ్చేసరికి ఆటోమేటిక్ గా పోటీ మొదలైందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. తాజాగా అలాంటి పరిస్థితే సూపర్ స్టార్ మహేష్ బాబు, దళపతి విజయ్ లకు ఎదురైంది. మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి ఇటీవలే ‘కళావతి‘ అనే లవ్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే.
అదే విధంగా వాలెంటైన్స్ డే సందర్భంగా దళపతి విజయ్ నటిస్తున్న ‘బీస్ట్’ సినిమా నుండి ‘అరబిక్ కుతు‘ సాంగ్ విడుదలైంది. ఈ రెండు పాటలకు ప్రత్యేకమైనవే.. కానీ రికార్డుల ప్రకారం చూసుకుంటే.. ఓ హీరో సాంగ్ క్రియేట్ రికార్డులను, మరో హీరో సాంగ్ బ్రేక్ చేయడం అనేది మాములు విషయం కాదు. కళావతి లిరికల్ సాంగ్ విడుదలైన 24 గంటల్లో 16 మిలియన్స్ వ్యూస్, 8 లక్షల లైక్స్ రాబట్టి సౌత్ ఇండియాలో మోస్ట్ వ్యూయడ్ సాంగ్ గా రికార్డు నమోదు చేసింది.
ఇక దళపతి విజయ్ ‘అరబిక్ కుతు’ లిరికల్ సాంగ్.. విడుదలైన 14 గంటల్లోనే 16 మిలియన్ వ్యూస్, 1.2 మిలియన్ పైగా లైక్స్ రాబట్టి, కళావతి సాంగ్ రికార్డును బ్రేక్ చేసింది. ప్రస్తుతం సాంగ్ రిలీజై 24 గంటలు సమీపిస్తుండటంతో 23 మిలియన్స్ వ్యూస్ దాటి 24 మిలియన్ల వ్యూస్ వైపు దూసుకుపోతుంది. ఇక లైక్స్ పరంగా 22 గంటలకు 2.1 మిలియన్స్ పైగా రాబట్టడం విశేషం.
అటు దళపతి, ఇటు సూపర్ స్టార్ ఇద్దరి సాంగ్స్ రికార్డులు క్రియేట్ చేయడం, వాటిని బ్రేక్ చేయడంతో ఫ్యాన్స్ అంతా సందడి చేసుకుంటున్నారు. అయితే.. ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మాత్రం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వార్ అనేది కామన్. కానీ ఈసారి అలాంటి వాతావరణం కనిపించకపోవడం సంతోషకరమైన విషయం.
ఇక ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే టాప్ స్థానాలలో అరబిక్ కుతు(1), కళావతి(2) సాంగ్స్ నిలిచాయి. మొత్తానికి దళపతి విజయ్ సౌత్ ఇండియన్ ఆల్ టైమ్ రికార్డు వ్యూస్ సెట్ చేశాడు. ఇక ఏప్రిల్ 14న దళపతి బీస్ట్, మే 12న మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అరబిక్ కుతు, కళావతి సాంగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.